పది పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2020-05-22T09:43:53+05:30 IST

జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అధికారులు కరోనా నియమాలను పరిగణలోకి తీసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని

పది పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌, మే 21: జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో అధికారులు కరోనా నియమాలను పరిగణలోకి తీసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ ఇతర శాఖ అధికారులతో మిగిలిన వార్షిక పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 61 సెంటర్లలో కోవిడ్‌ -19ను దృష్టిలో ఉంచుకొని జాగ్రతలు తీసుకోవాలన్నారు.


విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజ్‌లు అందించడమేకాకుండా, పరీక్ష కేంద్రాల్లో హైడ్రోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలన్నారు. 7,651 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో విద్యార్థి భౌతిక దూరాన్ని పాటించడమే కాకుండా పరీక్ష నిర్వహణలో విధులు నిర్వహించే అధికారులు కరోనా వైరస్‌ నివారణ జాగ్రత్తలపై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, డీఎం అండ్‌ హెచ్‌వో నారాయణరావు, జిల్లా పరిశ్రమల అధికారి నర్సింహమూర్తి, జిల్లా పంచాయతీ శాఖ అధికారి నారాయణరావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-22T09:43:53+05:30 IST