రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-05-24T05:16:24+05:30 IST

రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి


  • జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌

వికారాబాద్‌, మే 23: జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలపై వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వికారాబాద్‌ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని తెలిపారు. వేడుకలకు అసెంబ్లీ డిప్యుటీ స్వీకర్‌ టి.పద్మారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. జూన్‌ రెండున ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారన్నారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా పతాకావిష్కకర ఉదయం 9నుంచి 10గంటల మధ్యలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని ఆఫీసులకు జూన్‌ 1న లైటింగ్‌ పెట్టాలన్నారు. రెండు రోజులూ వెలుగులతో విరాజిల్లేలా చూడాలన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలకు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. వివిధ శాఖలు తమ కార్యక్రమాలపై స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో తాండూరు, వికారాబాద్‌ ఆర్డీవోలు అశోక్‌కుమార్‌, విజయ్‌కుమారి, అదనపు ఎస్పీ రషీద్‌, ప్లానింగ్‌ అధికారి నిరంజన్‌రావు, పౌర సరఫరాలా అధికారి రాజేశ్వర్‌, అటవీ శాఖాధికారి వేణుమాధవ్‌, ఉద్యాన అధికారి చక్రపాణి, తహసీల్దార్‌ షర్మిల పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:16:24+05:30 IST