ఐటీఐ విద్యార్థుల శిక్షణకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-23T06:02:40+05:30 IST

ఐటీఐ విద్యార్థుల శిక్షణకు ఏర్పాట్లు

ఐటీఐ విద్యార్థుల శిక్షణకు ఏర్పాట్లు
పూడూరులోని వెజిటెబుల్‌ కస్టర్‌ను పరిశీలిస్తున్న మర్రి రాజశేఖర్‌రెడ్డి


మేడ్చల్‌, మే22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌ మండలం పూడూరు వ్యవసాయ సహకార సంఘం భవనంలో  ఏర్పాటుకానున్న వెజిటెబుల్‌ అండ్‌ ఫ్రూట్స్‌ కస్టర్‌లో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. రూ.4.70 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో సహకార సంఘం భవనంలో వెజిటెబుల్‌ అండ్‌ ప్రూట్స్‌ కస్టర్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఈ మధ్యనే టెండర్లు పూర్తి అయ్యాయి. యంత్రాల దిగుమతి కూడా  అయింది. షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి.  ఈ యూనిట్లలో ఐటీఐ విద్యార్థులకు శిక్షణ ఇస్తే వారికి ఉపాధి లభిస్తుందని మల్కాజ్‌గిరి పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఐటీఐ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు.  సుమారు 500 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలక్ట్రిషియన్‌, ఫిట్టర్‌, ఇతర అవసరాల కోసం వినియోగించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Updated Date - 2022-05-23T06:02:40+05:30 IST