సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-04-21T07:12:05+05:30 IST

శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం కల్యాణ వేడుకలకు ముస్తాబయ్యింది.

సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి

నల్లగొండ కల్చరల్‌, ఏప్రిల్‌ 20 : శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రామగిరి శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం కల్యాణ వేడుకలకు ముస్తాబయ్యింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా వేడుకలను నిర్వహించేందుకు ఆల య కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు లేకుండానే కమిటీ సభ్యులు, అర్చకస్వాములు కలిసి బుధవారం ఉదయం 12 గంటలకు సంప్రదాయ బద్దంగా వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య సీతారాముల తిరు కళ్యాణ వేడుకలను నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పట్టణంలోని రామగిరి శ్రీసీతారామచంద్ర స్వామి దేవాలయంలో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోళ్ల కార్యక్రమం కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా సంప్రదాయ పద్దతిలో అర్చక స్వాములు నిర్వహించారు. బుధవారం ఉదయం 12 గంటలకు సీతారాముల కల్యాణం జరిపేందుకు నిశ్చయించారు.  కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చకిలం వేణుగోపాల్‌రావు, ఈవో ముకిరాల రాజేశ్వరశర్మ, అర్చక స్వాములు, కమిటి సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-21T07:12:05+05:30 IST