సీఎం పర్యటనకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-01-24T06:41:18+05:30 IST

ఇంటి వద్దకే రేషన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి కదిరికి వస్తున్న సందర్భంగా హెలీప్యాడ్‌ స్థలాన్ని శనివారం కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, ఆర్‌డీఓ వెంకటరెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్‌, తహసీల్దార్‌ మారుతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల పరిశీలించారు

సీఎం పర్యటనకు ఏర్పాట్లు

హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

కదిరి, జనవరి 23 : ఇంటి వద్దకే రేషన పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి కదిరికి వస్తున్న సందర్భంగా హెలీప్యాడ్‌ స్థలాన్ని శనివారం కదిరి ఎమ్మెల్యే డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, ఆర్‌డీఓ వెంకటరెడ్డి, డీఎస్పీ భవ్యకిశోర్‌, తహసీల్దార్‌ మారుతి, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల పరిశీలించారు. తాయిసూర్యనారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వేమన ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లను వీరు పరిశీలించారు. డిగ్రీ కళాశాలలో హెలీప్యాడ్‌, వేమన ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సభ కోసం స్థలాలను పరిశీలించారు. 



Updated Date - 2021-01-24T06:41:18+05:30 IST