జేసీ వేణుగోపాల్‌రెడ్డి
విశాఖపట్నం, జనవరి 17: భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంయ్యనాయుడు బుధవారం (19న) జిల్లా పర్యటనకు రానున్నారని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి రాక దృష్ట్యా అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు.
ఈనెల 22వ తేదీ వరకు వెంకయ్యనాయుడు జిల్లాలో ఉంటారని, పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఎయిర్ పోర్టులో రిసెప్షన్, పోర్టు గెస్ట్‌హౌస్‌లో బస ఏర్పాట్లతోపాటు వైద్యసేవలు, వాహనాల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.