భారీ రియాక్టర్‌ రాకకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-03-05T06:37:10+05:30 IST

హెచ్‌పీసీఎల్‌కు త్వరలో మరో భారీ రియాక్టర్‌ రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

భారీ రియాక్టర్‌ రాకకు ఏర్పాట్లు
డివైడర్‌ తొలగించిన చోట రోడ్డు పనులు చేస్తున్న దృశ్యం

మల్కాపురం, మార్చి 4 : హెచ్‌పీసీఎల్‌కు త్వరలో మరో భారీ రియాక్టర్‌ రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటీవల జీవీఎంసీ తాత్కాలికంగా వేసిన డివైడర్‌ను తొలగించి ఆ ప్రాంతంలో సిమెంట్‌తో చదును చేసే పనులు చేపడుతున్నారు. అలాగే సింధియా ప్రాంతంలో ఉన్న ఫుట్‌పాత్‌ను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారు. సముద్ర మార్గం గుండా సింధియా  చేరిన ఈ భారీ రియాక్టర్‌ను హెచ్‌పీసీఎల్‌కు తీసుకు వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రియాక్టర్‌ రావడానికి వీలుగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-03-05T06:37:10+05:30 IST