ఆలయాల్లో భౌతికదూరానికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల్లో భౌతిక దూరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆలయాల్లో భౌతికదూరానికి ఏర్పాట్లు

ఖమ్మం సాంస్కృతికం మే25: ఖమ్మం ఉమ్మడి జిల్లాలోని దేవాలయాల్లో భౌతిక దూరానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవల లాక్‌డౌన్‌ కారణంగా  భక్తులకు స్వామి వారి దర్శనాలను నిలిపివేశారు. కేవలం అర్చకులతో ఏకాంతంగా మాత్రమే పూజలు జరుపుతున్నారు. లాక్‌డౌన్‌ సడలిస్తున్న నేపథ్యంలో త్వరలో దేవాలయాల్లోను భక్తులను అనుమతించే అవకాశాలు ఉన్నాయి.


ఈనెల 31వరకు లాక్‌డౌన్‌ ఉన్నందున అప్పటి వరకు దర్శనాలు నిలిపి, ఆ తర్వాత ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉండటంతో ముందుగానే  ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా భౌతిక దూరం తప్పనిసరి కావడంతో ఈ ఏర్పాట్లలో ఆలయాలల నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఖమ్మం నగరంలోని ఆలయాలతో పాటు దుమ్ముగూడెం పర్ణశాల, భద్రాచలం, అశ్వారావుపేట చిలకలగండి, తదితర ప్రాతాల్లోని ఆలయాలతో పాటు అన్ని ఆలయాల్లో భౌతిక దూరంకోసం ప్రత్యేకంగా బాక్స్‌లే ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST