నూతన కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-13T05:07:56+05:30 IST

నూతన కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

నూతన కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ ఆవరణను పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు

  • సీఎం పర్యటన రూట్‌ మ్యాప్‌పై ఎమ్మెల్యేలు,  అధికారులతో మంత్రి సబితారెడ్డి సమీక్ష 
  • నూతన కలెక్టరేట్‌ వద్ద సభా వేదిక పరిశీలన

వికారాబాద్‌, 12(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల నూతన కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న వికారాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. శుక్రవారం ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, మహే్‌షరెడ్డి, నరేందర్‌రెడ్డి, కలెక్టర్‌ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌ పటేల్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ విజయకుమార్‌లతో కలిసి కలెక్టరేట్‌ను సందర్శించి అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌, ఎస్పీ.. మంత్రికి వివరించారు. ఎస్పీ కార్యాలయ ఆవరణలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టరేట్‌లో పరిశుభ్రత, సుందరీకరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, రోడ్లకు ఇరువైపులా మొక్కలతో పాటు పారిశుధ్య పనులు చేపడుతున్నట్టు కలెక్టర్‌ వివరించారు. సభాస్థలి, పార్కింగ్‌, ఇతర ఏర్పాట్లపై సబితారెడ్డి సమీక్షించారు. అనంతరం బహిరంగ సభ వేది కను పరిశీలించారు. ప్రాంగణంలోకి వచ్చే వీఐపీలకు, ప్రజలకు ప్రవేశ ద్వారాలు ఏర్పాట్లపై ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మినిట్‌ టు మినిట్‌ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని, ఒక్కో విభాగానికి ఒక్కో జిల్లా స్థాయి అధికారిని నియమించి బాధ్యత అప్పగించాలని, లోటుపాట్లు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సీఎం పర్యటన వివరాలను అధికారులు రూట్‌ మ్యాప్‌ ద్వారా మంత్రికి వివరించారు. 


  • టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం సందర్శన

నిర్మాణం పూర్తి చేసుకున్న వికారాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. 16న సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్న పార్టీ కార్యాలయం, సమావేశ హాల్‌ను పరిశీలించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో పార్టీ కార్యాలయం ప్రార ంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి చర్చించారు.


  • పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

సీఎం కేసీఆర్‌ జిల్లా పర్య టన సందర్భంగా వివిధ శాఖల అధికారులకు కేటాయించిన పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో వికారాబాద్‌ కలెక్టర్‌ కె.నిఖిల పరిశీలించారు. కలెక్టరేట్‌ నుంచి శివారెడ్డిపేట వరకు రోడ్డు మరమ్మతులు, మొక్కలు నాటే పనులు, పారిశుధ్య పనులను పరిశీలించారు. ఎన్నెపల్లి రహదారికి ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలన్నారు. ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డు మరమ్మతు లు చేపట్టి మొక్కలు నాటాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ఆమె వెంట జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఇన్‌చార్జి ఆర్డీవో అశోక్‌కుమార్‌, డీపీవో మల్లారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, డీఎల్పీవో అనిత ఉన్నారు.


  • 17న కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌ను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో పూర్తిఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌లతో కలిసి మంత్రి సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు, ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి మా ట్లాడుతూ 30ఎకరాల్లో రూ.56.20కోట్లతో అన్ని హంగులతో కొత్త కలెక్టరేట్‌ను నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. 17న సీఎం కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించనున్నందున ఏమైనా పనులు మిగిలి ఉంటే పూర్తిచేయాలన్నారు. కలెక్టరేట్‌ను రంగురంగుల లైట్లతో అలంకరించాలని, మొక్కలు నాటాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సభావేదిక ఏర్పాట్లను పరిశీలించి సూచనలు, సలహాలు చేశారు. 17న పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీ ఉంటుందని, సమావేశానికి సుమారు 12వేల మంది వస్తారని భావిస్తున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్‌కు తెలిపారు. కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ ఎస్పీ ఎన్‌.వి.కృష్ణారావు, అదనపు కలెక్టర్లు శ్యాంసన్‌, లింగ్యానాయక్‌, డీఆర్‌డీఏ పద్మాజారాణి, జడ్పీ సీఈవో దేవ సహాయం, డీపీవో రమణమూర్తి పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ అన్నారు. జిల్లా అధికారులకు అ ప్పగించిన పనులను పూర్తి బాధ్యతతో నిర్వహించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణిని నోడల్‌ అధికారిగా నియమించామన్నారు.

Updated Date - 2022-08-13T05:07:56+05:30 IST