Abn logo
Sep 17 2021 @ 00:29AM

‘పరిషత్‌’ కౌంటింగ్‌కు ఏర్పాట్లు

పాయకరావుపేట పాఠశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారులు

  మండలాల్లో సిబ్బందికి సూచనలు 

కేంద్రాలను పరిశీలించిన అధికారులు

నర్సీపట్నం అర్బన్‌, సెప్టెంబరు 16 : పరి షత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు సిద్ధం కావాలని నర్సీపట్నం మండల ఎన్నికల అధికారిణి సరోజిని సూచించారు. కౌంటింగ్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఎంపీడీవో గురువారం వివిధ శాఖల అధికారులతో ఇక్కడ సమావేశమై సూచనలు చేశారు. కౌంటింగ్‌కు ఎలా ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్‌ ఎన్నికల అధికారిణి ఎన్‌.జయమాధవి తదితరులు పాల్గొన్నారు. 

పాయకరావుపేట: పరిషత్‌ ఎన్నికల కౌం టింగ్‌కు కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పాయకరావుపేట మం డలంలో అధికారులు చేపడుతున్నారు. బ్యాలెట్‌ బ్యాక్స్‌లను భద్రపరిచిన ప్రభుత్వ ఉన్నత పాఠ శాలలోనే కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం సదరు పాఠశాలను ఎంపీడీవో సాంబశివరావు, తహసీల్దార్‌ పి.అంబేడ్కర్‌, ఈవోపీఆర్‌డీ వెంకటనారాయణతో పాటు పలువురు అధికారులు పరిశీలించారు.