డి 158: మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-10-28T05:44:07+05:30 IST

బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు స్పష్టం చేశారు.

డి 158: మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు    ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు

30వ తేది ఉదయం 7 నుంచి సాయంత్రం7 వరకు పోలింగ్‌

అన్ని పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌

ఇతర ప్రాంతాల వారు నియోజకవర్గంలో ఉండకూడదు

2000 మంది పోలీసులతో బందోబస్తు

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 27: బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు  పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వి.విజయరామరాజు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఉప ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, ఎలక్టోరల్‌, ఈవీఎంలు, పోలీసు బందోబస్తు తదితరాలపై ఎస్పీ కేకే అన్బురాజన, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి, డీఆర్వో మలోలతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలకు సంబంధించి 272 పోలింగ్‌ స్టేషన్లు, అదనంగా మరో 9 పోలింగ్‌ స్టేషన్లతో కలపి 281వరకు ఉన్నాయన్నారు. వీటిలో 148 వరకు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుయి, 62 నార్మల్‌ లొకేషన్లు ఉన్నాయన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు ఓటరు నమోదు జాబితా సిద్ధం చేశామని,  ఎలక్షన కమిషన నుంచి అన్ని పోలింగ్‌ కేంద్రాలకు వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఆమేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాని తెలిపారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి 72 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌ ఉంటుందని వివరించారు. బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేశామని, సి-విజిల్‌ యాప్‌  ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎలక్షన కమిషనకు చేరవేస్తామని తెలిపారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 281 ఈవీఎంలు సిద్ధం చేశామని, 96 ఈవీఎంలు అదనంగా రిజర్వులో ఉంచామని తెలిపారు. ఈవీఎంలు, పోలింగ్‌ మెటీరియల్‌ ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. కొవిడ్‌ కు సంబంధించి శానిటైజర్లు, పీపీ కిట్స్‌ సిద్ధం చేశామని తెలిపారు. ఎస్పీ అన్బురాజన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నుండి సైలెంట్‌  పీరియడ్‌ అని, ఎంసీసీ నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రచారాలు, సభలు, క్యాంపులు, సమావేశాలు నిర్వహించరాద న్నారు.  సెంట్రల్‌ పోలీసుతో కలపి 2000 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని అన్నారు. నియోజక వర్గంతో సంబంధం లేనివారు ఎవున్నా కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - 2021-10-28T05:44:07+05:30 IST