క్రమంలో అమర్చగలరా?

ABN , First Publish Date - 2020-06-02T05:30:00+05:30 IST

వాక్యాలను క్రమపద్ధతిలో అమర్చగలరా? అయితే ఈ యాక్టివిటీ మీకోసమే! ఇద్దరు, ముగ్గురు పిల్లలు కలిసి ఈ యాక్టివిటీలో పాల్గొనవచ్చు...

క్రమంలో అమర్చగలరా?


వాక్యాలను క్రమపద్ధతిలో అమర్చగలరా? అయితే ఈ యాక్టివిటీ మీకోసమే! ఇద్దరు, ముగ్గురు పిల్లలు కలిసి ఈ యాక్టివిటీలో పాల్గొనవచ్చు.




  • ఇందుకు కావలసినవి...
  • ఇండెక్స్‌ కార్డులు
  • పెన్సిల్‌
  • మార్కర్‌
  • పిన్నులు


  • ఎలా ఆడాలంటే...
  • ముందుగా ఒకరు ఏదైనా సందర్భం గురించి లేదా ఏదైనా సంఘటన గురించి చెప్పాలి. దానికి సరైన ప్రారంభం, ముగింపు లేకపోయినా ఫరవాలేదు.
  • ఆ అకేషన్‌లో నాలుగైదు వాక్యాలు తప్పనిసరిగా ఉండాలి.
  • ఆ వాక్యాలను ఇండెక్స్‌ కార్డుపై రాయాలి. 
  • ఉదాహరణకు స్కూల్‌ నుంచి వచ్చాను. షూస్‌ విప్పాను. చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కున్నాను. స్నాక్స్‌ తిన్నాను. సైకిల్‌ తొక్కడానికి బయటకు వెళ్లాను. ఇవీ వాక్యాలనుకుంటే... వీటిని ఇండెక్స్‌ కార్డులపై రాసి వరుస క్రమంలో కాకుండా మార్చి పెట్టాలి.
  • ఆట ఆడుతున్న వ్యక్తి తిరిగి ఆ కార్డులను ఆర్డర్‌లో పెట్టాలి. సరైన క్రమంలో అమర్చిన వారు గెలిచినట్టు!

Updated Date - 2020-06-02T05:30:00+05:30 IST