Arpita Mukherjee running beauty parlour: ఈడీ విచారణలో వెలుగుచూసిన అర్పితా ముఖర్జీ బ్యూటీపార్లర్ల బాగోతం

ABN , First Publish Date - 2022-08-03T14:28:54+05:30 IST

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో(teachers recruitment scam) కీలక నిందితురాలైన అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee) ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి....

Arpita Mukherjee running beauty parlour: ఈడీ విచారణలో వెలుగుచూసిన అర్పితా ముఖర్జీ బ్యూటీపార్లర్ల బాగోతం

నెయిల్ పార్లర్ల పేరిట జీఎస్టీ నంబర్

ఈడీ విచారణలో సంచలన విషయాలు వెల్లడి

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో(teachers recruitment scam) కీలక నిందితురాలైన అర్పితా ముఖర్జీ(Arpita Mukherjee) ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.అర్పితా ముఖర్జీకి మ్యాజిక్ టచ్ పేరిట 4 బ్యూటీ, నెయిల్ పార్లర్లు ఉన్నాయని వెల్లడైంది. 10 రోజుల ఈడీ కస్టడీ బుధవారం ముగియడంతో అర్పితాముఖర్జీని పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


టీచర్ల రిక్రూట్ మెంట్ స్కాంలో సూత్రధారి అయిన పశ్చిమబెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీకి (former Bengal minister Partha Chatterjee), అతని సన్నిహిత అనుచరురాలు అయిన అర్పితా ముఖర్జీకి వ్యాపార సంబంధాలున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(Enforcement Directorate)విచారణలో వెల్లడైంది. అర్పితాముఖర్జీ ఫ్లాట్లలో 52కోట్ల రూపాయల నగదుతోపాటు పెద్దఎత్తున బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీమంత్రి పార్థా చటర్జీకి ఓ పారిశ్రామికవేత్తగా బహుమతిగా ఇచ్ఛిన ఫ్లాటులో అర్పితా ముఖర్జీ నివాసముంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. 


మంగళవారం అర్పితాకు చెందిన ఫోర్ట్ ఒయాసిస్ అపార్టుమెంటులోని ఫ్లాటును ఈడీ సీజ్ చేసింది. అర్పితాకు కోల్ కతాలోని బారాంగే, పాటులీ టౌన్ షిప్, లేక్ వ్యూ రోడ్డు ప్రాంతాల్లో మూడు నెయిల్ సెలూన్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో ఆయా నెయిల్ సెలూన్లపై ఈడీ అధికారులు దాడులు చేశారు.అర్పితా ఓ బ్యూటీపార్లర్(beauty parlour) నడుపుతోందని(running), దానిపేరిట ఓ జీఎస్టీ నంబరు(GST number) తీసుకున్నారని తేలింది.నాలుగు బ్యూటీపార్లర్లు నడుతుపున్న అర్పితాకు కోట్ల రూపాయలు ఎక్కడనుంచి వచ్చాయో ఈడీ అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. 


మరో జీఎస్టీ నంబరును అర్పిత తీసుకున్నా, ఆమె ఈ జీఎస్టీ నంబరును(unaccounted GST number) ఏ వ్యాపారానికి లింక్ చేయలేదని దర్యాప్తులో వెలుగుచూసింది. అక్రమ సంపాదన కోసమే అదనంగా ఓ జీఎస్టీ నంబరు తీసుకుందని ఈడీ అధికారులు చెప్పారు. తన ఫ్లాటులో డబ్బును పార్థాచటర్జీ మనుషులు పెట్టారని, ఈ విషయం తనకు తెలియదని ఈడీ విచారణలో అర్పితా ముఖర్జీ చెప్పారు.పార్థాచటర్జీకి వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఓ మహిళ ఆయనపై చెప్పు విసిరింది. 


Updated Date - 2022-08-03T14:28:54+05:30 IST