Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 11 Aug 2022 11:25:09 IST

Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ ‘జపానీ టాయ్’ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

twitter-iconwatsapp-iconfb-icon
Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో  దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ జపానీ టాయ్ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

అర్పితా ముఖర్జీ - ఈ పేరు దేశమంతా ఇప్పుడు మార్మోగిపోయింది. పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉద్యోగుల నియామక కుంభకోణంలో అరెస్టయిన తృణముల్ కాంగ్రెస్ నేత, (అప్పటి) మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత నివాసాల్లో కోట్లాది రూపాయల డబ్బుతో పాటు భారీగా బంగారం, కీలక డాక్యుమెంట్లను కూడా ఎన్ఫోర్సుమెంట్ డైరక్టరేట్ (Enforcement Directorate) సీజ్ చేసిన విషయం తెలిసిందే. పార్థ ఇద్దరూ ఆ డబ్బుదస్కంతో తమకి సంబంధం లేదని ప్రకటించినా, అదంతా 'కీర్తి- కాంత- కనకం' మధ్య చిక్కుకున్న తరతరాల రాజకీయ చరిత్రలో ఇదొక తాజా అంకమని దేశం నమ్మేసింది. అర్పితకి ‘స్వాహా’, ‘నైవేద్య’,’ కైంకర్య ‘… వంటి అనేకానేక మారుపేర్లతో మీమ్స్ (Memes) తయారైపోయాయి. అయితే, అర్పిత ఇళ్లలో దొరికిన ధన, కనక వస్తు వాహనాలు అన్నీ ఒకెత్తు, ఈడీ సోదాల్లో దొరికినట్టు బైటకి పొక్కిన రెండు సెక్స్ టాయ్స్ (Sex Toys) విషయం మరొక ఎత్తు. 


మీడియాకు, సోషల్ మీడియాకూ ఈడీ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉప్పందించారని, అదొక చవకబారుతనమని విమర్శలు వచ్చాయి. ఒకవేళ అర్పిత ఇంట్లో ఆమె చిన్నప్పుడు ఆడుకున్న లక్కపిడతలు, తనకి పోతపాలు పట్టించిన ఉగ్గుగిన్నె, చెవులు కుట్టించినప్పటి చెందిరి దిద్దులు, వసకొమ్ముని అరగదీసిన సాన, చింతపండు దాచే చిల్లుల సోల,  వెండి పట్టీలు దాచే కావిడి పెట్టి, నవారు చిరిగిన వాలు కుర్చీ, ఆమె తాతయ్య వాడిన కిర్రు చెప్పులు, మువ్వల మోతల చేతికర్ర, వాడకం లేక మూలన పడి ఉన్న నూనె జిడ్డుల దీపపుసెమ్మ వగైరాలు తమ సోదాలతో దొరికితే ఈడీ ఆ వివరాలు చెప్పేదా? అసలు ఆ వ్యక్తిగతమైన వస్తువుల గురించి టిప్ అందించవల్సిన అవసరం ఏముంది అంటున్నారు కొందరు. ఏదిఏమైనా, ఈడీ సోదాలలో  దొరికిన రెండు సెక్స్ టాయ్స్ గురించి  దేశ వ్యాప్తంగా మీడియా హోరెత్తిపోయింది. సెక్స్ టాయ్స్ లైంగిక ప్రేరేపణకి, ఉద్దీపనకీ సంబంధించినవి కావడం వల్ల పార్థ లైంగిక పటుత్వం మీద కూడా వ్యంగ్యమైన ట్వీట్లు వెల్లువెత్తాయి. Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో  దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ జపానీ టాయ్ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

సెక్స్ టాయ్స్- వెస్ట్ బెంగాల్ కనెక్షన్! 


ఈడీ అధికారులతో సహా, పశ్చిమ బెంగాల్ సామాన్య ప్రజలకి కూడా సెక్స్ టాయ్స్ గురించి ఎంతో ఆసక్తి, కుతూహలం ఏర్పడటానికి కారణం స్థానిక HoiChai OTT లో వచ్చి, తెగ పాపులర్ అయిన 'Japani Toy', 'Japani Doll'... అనే రెండు వెబ్ సిరీస్ అంటున్నారు కొలకత (Kolkota) జర్నలిస్ట్ స్నేహాంశు అధికారి. HoiChai మొదట 'Japani Toy', దాని సీక్వెల్ గా 'Japani Doll'  వచ్చాయి. విచిత్రమేమిటంటే, వాటి టైటిల్స్ లో జపాన్ ఉన్నప్పటికీ, జపాన్ దేశానికీ ఆ బొమ్మలకీ ఎటువంటి సంబంధం లేదని అంటారు స్నేహాంశు. ఆయన మాటల్లో చెప్పాలంటే, పశ్చిమ బెంగాల్ వాసులైతే ఆ విషయంలో ఎటువంటి వింత లేదు. ఎందుకంటే, స్థానికంగా 'జపానీ తేల్ (Japani Oil)' ఒక లైంగిక ప్రేరక ద్రవంగా అప్పటి నుంచో పేరుపొందింది కాబట్టి. ఎటు చూసినా, ఎక్కడ విన్నా దృశ్య శ్రవణ మాధ్యమాల్లో విరివిగా కనబడే, వినబడే జపానీ తేల్ ప్రకటనలు (advertisements) వల్ల జపానీ - అనే విశేషణం లైంగిక సంబంధమైనదిగానే అక్కడ ప్రజలు గుర్తిస్తారు. మన సిద్ధ మకరధ్వజం, మదన కామేశ్వరీ చూర్ణం, ఊరపిచుక లేహ్యాల మాదిరిగానే పలు మూలికలతో తయారయ్యే ఈ జపానీ తైలాన్ని ఆయుర్వేద వయాగ్రా (Viagra)గా గుర్తిస్తారు. ఆ తైలం తయారీదార్లు చెప్పుకునే ప్రభావమేదీ అందులో లేదని, అదంతా తప్పుడు ప్రచారమనీ పుణె ఆహార ఔషధ విభాగం (Food and Drugs Administration- FDA) వంటి సంస్థలు జపనీయ తైలం ప్రకటనలను నిలిపివేశాయి. అయినప్పటికీ, పశ్చిమ బెంగాల్ జనసామాన్యం బుర్రలోంచి జపాన్ విశేషణానికి ఇచ్చుకున్న అర్థం మాత్రం ఎవ్వరూ తొలిగించలేకపోయారు. 

      


Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో  దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ జపానీ టాయ్ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

'Japani Toy'... 'Japani Doll'-  వెబ్ సిరీస్ కథాకమామీషు!


దేశరాజధాని ఢిల్లీలో ఉద్యోగం కోసం వెళ్లిన బెంగాలీ యువకుడు జాయ్ (Joy) ఓ సారి ఫ్రెండ్స్ బలవంతం చేయడంతో వేశ్యాగృహం (brothel)కి వెళ్తాడు. ఆ విషయంలో అనుభవశూన్యుడైన జాయ్‌కి జీవితకాలానికి సరిపడా ఒక విచిత్రమైన అనుభవం ఎదురౌతుంది. కాగా, ఢిల్లీలో ఉద్యోగం కోసం కాళ్లకి బలపాలు కట్టుకొని తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కొలకత వచ్చేస్తాడు. సొంతగూటికి చేరుకున్నాక, సిటీలోనే తొలి సెక్స్ టాయ్స్ దుకాణం తెరవాలని నిర్ణయించుకుంటాడు. అతను చేయబోయే వ్యాపారం ఏమిటో తెలియక షాప్ లీజుకి ఇచ్చిన స్థానిక కౌన్సిలర్ గోబర్దన్, విషయం తెలిశాక అడ్డం తిరుగుతాడు. స్కూలు పరిసరాల్లోనే లిక్కర్ షాపు పెట్టిన గోబర్ధన్‌ని తప్పుబట్టని జనం, తన సెక్స్ టాయ్స్ దుకాణం గురించి అభ్యంతరాలు చెప్పడం జాయ్‌కి నచ్చదు. 


Dildo Kumarగా పేరుబడ్డ (Dildo- స్త్రీల కోసం తయారు చేయబడ్డ సెక్స్ టాయ్) జాయ్ చేద్దామనుకున్న సెక్స్ టాయ్స్ బిజినెస్ ఐడియా అతని ప్రియురాలు కింకిణి కుటుంబంలో కూడా ప్రకంపనలు సృష్టిస్తాయి. ఒక పక్క కింకిణి ప్రేమని గెలుచుకోవడం, మరో పక్క తను అనుకున్న వ్యాపారాన్ని మొదలెట్టడం - మధ్య జాయ్ పడే అగచాట్లే 'japanI Toy' వెబ్ సిరీస్. 2018లో HoiChai లో హాస్య విభాగం (Comedy Genre)లో వచ్చిన ఈ వెబ్ సిరీస్- సెక్స్ విషయంలో వెస్ట్ బెంగాల్ ప్రజల హిపోక్రసీని ఆటపట్టించిందని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 


Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో  దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ జపానీ టాయ్ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

'Japani Doll అనే కొత్త Calm Sutra'! 


అది విజయవంతం కావడంతో దర్శకుడు సౌరవ్ చక్రవర్తి (Sourav Chakraborty)- 'Japani Doll'ని అదే రాజ్ దీప్ గుప్త (Rajdeep Gupta), ఈషా సహా(Ishaa Saha), రజిత్ గంతూలి (Rajat Ganguly) తదితర తారాగణంతో తీశాడు. కొంకిణితో పెళ్లయిపోతుంది జాయ్ కి. లైంగిక ఉత్సాహాన్ని ఎన్నో రెట్లు పెంచే జపానీ డాల్స్ అమ్మకం గురించి కుడా పథకాలు వేస్తాడతను. దేశ జనాభాని అరికట్టే విషయంలో తన దగ్గర అదిరిపోయే ప్లాన్ ఉందనుకుంటాడు. కర్మకాలి జైలులో పడతాడు. ఒంటరి ఖైదీలకి మెత్తని తలగడలు ఇవ్వాలని తోటి ఖైదీతో కలిసి ఉద్యమం లేవదీస్తాడు. జైలు నుంచి విడుదల అయ్యాక మళ్లీ బిజినెస్ ప్లానులు మొదలెడతాడు. ఒక దశలో విసిగిపోయి హిమాలయాలకి పారిపోదామనుకుంటే, అతని జపానీ బొమ్మల వ్యాపార భాగస్వాములు మాత్రం కాబూల్ వెళ్తే మంచి లాభం ఉంటుందని ఊరిస్తారు. ఇలా అనేక మలుపులు తిరిగే సీక్వెల్ Japani Doll కూడా సూపర్ హిట్. Sex Toys… Japani Toy: అర్పిత ఇంట్లో  దొరికిన సెక్స్ టాయ్స్ కి పాపులర్ జపానీ టాయ్ వెబ్ సిరీస్ కీ సంబంధం ఉందా?

ఆసక్తి... మాత్రమేనా... అవగాహన... అమ్మకాలు కూడా పెరిగాయా?

 

'HoiChai' లో ప్రసారమై, తర్వాత Amazon Prime లో కూడా స్ట్రీమ్ అయ్యి, సెక్స్ టాయ్స్ పట్ల పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ఆసక్తి కలిగించాయి 'Japani Toy'... 'Japani Doll'-  వెబ్ సిరీస్.  అయితే, వాటివల్ల సెక్స్ టాయ్స్ గురించి అవగాహన ఏమీ కలగలేదని అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జురీడికల్ సైన్సెస్ (National Institute of Juridical Sciences)లో సోషియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న రుచిర గోస్వామి.  సెక్స్ టాయ్స్ అమ్మకాలు కూడా ఏమీ  అమాంతం పెరిగిపోలేదని అంటున్నారు స్థానిక మార్కెట్ విశ్లేషకులు. బహుశా పెచ్చురిల్లిన కుతూహలం, ఉబుసుపోని ఉబలాటం కారణంగానే ఈడీ అధికారులు- అర్పిత ఇంట్లో సెక్స్ టాయ్స్ దొరికాయని అసందర్భంగా బైటబెట్టారని అన్నారు, పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక అధికారి. 


అర్పిత ఇంట్లో సెక్స్ టాయ్స్ దొరికాయని తెలియగానే సోషల్ మీడియాలో వెల్లువెత్తిన పోస్టుల్లో ఒకటి ప్రముఖ నటి, వామపక్ష భావాలున్న శ్రీలేఖ మిత్ర ట్వీట్.  తృణమూల్ కాంగ్రెస్ మీద తరచూ విరుచుకుపడే శ్రీలేఖ- "పార్థ పనికిరావడం లేదా, జాతి దీని గురించి తెలుసుకోవాలనుకుంటుంది ('Nation Wants to Know' - అంటుండే పాత్రికేయుడు ఆర్ణబ్ గోస్వామి (Arnab Goswami)ని అనుకరిస్తూ)" - అని సెక్స్ టాయ్స్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సెక్స్ టాయ్స్ ని అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరకడానికి లైంగిక కారణాలే ఉండనక్కర్లేదనీ, సినీ నటి అయిన అర్పిత వెబ్ సిరీస్ నిర్మాణంలో పాలుపంచుకునే ప్రయత్నాల్లో భాగంగా కూడా వాటిని ఉంచుకొని ఉండొచ్చని సినీరంగానికి చెందిన మరికొందరు శ్రీలేఖ మిత్ర వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. 


లైంగిక జీవితం మీద అభిరుచి, లైంగికారోగ్యం పట్ల అవగాహన ఉన్న కాస్మోపాలిటన్ నగరాలలో సెక్స్ టాయ్స్ అమ్మకాలు పెరుగుతున్నాయి అని ఒక స్టడీ చెబుతోంది. కాబట్టి, శ్రీలేఖ మిత్ర వంటి అత్యధికులు అనుకున్నట్టు తమ  భాగస్వాముల లైంగిక సామర్థ్యం- సెక్స్ టాయ్స్ అమ్మకం విలోమ నిష్పత్తి(inversely proportion) లో ఉంటాయనుకోవడం మరో అపోహ అని కొట్టేస్తున్నారు స్కాలర్స్. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.