ఒక్క ఏడాదిలోనే కువైత్‌లో 3వేల మంది అరెస్ట్.. ఇందులో భారతీయులు కూడా.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-02-05T16:17:17+05:30 IST

కువైత్ ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది సుమారు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధిం

ఒక్క ఏడాదిలోనే కువైత్‌లో 3వేల మంది అరెస్ట్.. ఇందులో భారతీయులు కూడా.. వాళ్లు చేసిన నేరం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: కువైత్ ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. గత ఏడాది సుమారు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించింది. అరెస్ట్ అయిన వారిలో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


డ్రగ్స్ అక్రమ రవాణాపై కువైత్ సీరియస్‌గా ఉంది. కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే కువైత్‌లోకి డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. మత్తుపదార్థాలను అక్రమంగా తరలిస్తూ 2021లో సుమారు 3వేల మంది పట్టుబడ్డారని జనరల్ అడ్మిన్‌స్ట్రేషన్ ఫర్ డ్రగ్ కంట్రోల్ ఓ ప్రకటలో తెలిపింది. అరెస్ట్ అయిన వారిలో 1500 మంది కువైత్ పౌరులు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 1500 మందిలో సిరియా, ఇండియా, పాకిస్థాన్‌కు చెందిన పౌరులు ఉన్నట్టు పేర్కొంది. 1700 కేజీల పౌడర్, 10 మిలియన్ల పిల్స్‌ను సీజ్ చేసినట్టు వెల్లడించింది. ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టబడటం ఇదే తొలిసారని తెలిపింది. 




Updated Date - 2022-02-05T16:17:17+05:30 IST