సుగంధ భరితం అప్పన్న చందనం

ABN , First Publish Date - 2021-05-13T05:13:10+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామికి ఈనెల 14న తొలివిడతగా సమర్పించనున్న చందనంలో శుక్రవారం ఆలయ వైదిక అధికారులు సుగంధ ద్రవ్యాలను మిళితం చేశారు.

సుగంధ భరితం అప్పన్న చందనం
చందనంలో సుగంధ ద్రవ్యాలు కలుపుతున్న అర్చకులు

సింహాచలం, మే 12: వరాహలక్ష్మీనృసింహస్వామికి ఈనెల 14న తొలివిడతగా సమర్పించనున్న చందనంలో శుక్రవారం ఆలయ వైదిక అధికారులు సుగంధ ద్రవ్యాలను మిళితం చేశారు. బుధవారం ఉదయం స్థానాచార్యుడు డాక్టర్‌ టీపీ రాజగోపాల్‌ పర్యవేక్షణలో ఇన్‌చార్జి ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, పురోహితుడు కరి సీతారామాచార్యులు ముందుగా ఆలయ బాంఢాగారం నుంచి చందనపు ముద్దను బయటకు తీసి.. అందులో కచోరాలు, వట్టివేళ్లు, కస్తూరి పసుపు, పచ్చాకు, కస్తూరి, వావిలాలు, బావంచాలు, లవంగాలు, జాపత్రి, జాజికాయ, దాల్చినచెక్క, కుంకుమపువ్వు, చెంగల్వ కోష్టు వంటి 16 రకాల సుగంధ ద్రవ్యాల చూర్ణాలను మిళితం చేసి మళీల భాండాగారంలో భద్రపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఈవో ఎంవీ సూర్యకళ పర్యవేక్షించారు.

Updated Date - 2021-05-13T05:13:10+05:30 IST