అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు

ABN , First Publish Date - 2020-10-20T05:30:00+05:30 IST

స్థానిక చర్చివీధిలోని అమరావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటు లోకి తెచ్చినట్లు డాక్టర్‌ రమణయ్య తెలిపారు

అందుబాటులోకి ఆరోగ్యశ్రీ సేవలు

గూడూరు, అక్టోబరు 19: స్థానిక చర్చివీధిలోని అమరావతి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను అందుబాటు లోకి తెచ్చినట్లు డాక్టర్‌ రమణయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్యసేవలను  అందిస్తున్నామ న్నారు. ఆర్యోగశ్రీ నిబంధనల మేరకు ఉచిత వైద్యసేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నిర్మల, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T05:30:00+05:30 IST