868 పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు

ABN , First Publish Date - 2022-05-23T09:20:08+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) జూన్‌ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

868 పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలు

  • 53 ప్యాకేజీలు.. ఒక్కో దానికి రూ.2100 చెల్లింపు
  • ఇందులో కొంత సిబ్బందికి.. కొంత ఆస్పత్రి అభివృద్ధికి
  • జూన్‌ 1 నుంచి అమలు చేయాలని సర్కార్‌ నిర్ణయం
  • మూడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంతాన సాఫల్య కేంద్రాలు
  • రూ.7.5కోట్లతో ఏర్పాటు.. త్వరలోనే అందుబాటులోకి
  • గాంధీలో రూ.30 కోట్లతో స్టేట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌
  • వైద్య పరికరాల నిర్వహణకు కొత్త పాలసీ: మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) జూన్‌ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 868 పీహెచ్‌సీలు ఉండగా.. ఇప్పటిదాకా వీటిల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రవేశపెట్టలేదు. తాజా నిర్ణయం మేరకు పీహెచ్‌సీల్లో మొత్తం 53 రకాల వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. ఒక్కో ప్యాకేజీకి రూ.2100 ప్రోత్సాహక నగదు ప్రభుత్వం నుంచి అందనుంది. ఈ నగదులో కొంత వైద్య సిబ్బందికి, మరికొంత పీహెచ్‌సీ అభివృద్ధి కోసం రివాల్వింగ్‌ ఫండ్‌ కింద జమ చేస్తారు. నగదు ప్రోత్సాహకాల వల్ల వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటమే కాకుండా, మెరుగైన సేవలు అందిస్తారని సర్కారు భావిస్తోంది. పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవల అమలుకు సంబంధించి ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అన్ని పీహెచ్‌సీలను ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రుల జాబితాలో చేర్చారు. ఆ సేవల కింద ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి పాస్‌వర్డ్‌, లాగిన్‌ ఐడీలనూ పంపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటులో

మిగతా 10వ పేజీలో... హైదరాబాద్‌, మే 22 (ఆంఽధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీల్లో) జూన్‌ ఒకటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 868 పీహెచ్‌సీలు ఉండగా.. ఇప్పటిదాకా వీటిల్లో ఆరోగ్యశ్రీ సేవలను ప్రవేశపెట్టలేదు. తాజా నిర్ణయం మేరకు పీహెచ్‌సీల్లో మొత్తం 53 రకాల వైద్య సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయనున్నారు. 


ఒక్కో ప్యాకేజీకి రూ.2100 ప్రోత్సాహక నగదు ప్రభుత్వం నుంచి అందనుంది. ఈ నగదులో కొంత వైద్య సిబ్బందికి, మరికొంత పీహెచ్‌సీ అభివృద్ధి కోసం రివాల్వింగ్‌ ఫండ్‌ కింద జమ చేస్తారు. నగదు ప్రోత్సాహకాల వల్ల వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటమే కాకుండా, మెరుగైన సేవలు అందిస్తారని సర్కారు భావిస్తోంది. పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవల అమలుకు సంబంధించి ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అన్ని పీహెచ్‌సీలను ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రుల జాబితాలో చేర్చారు. ఆ సేవల కింద ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి పాస్‌వర్డ్‌, లాగిన్‌ ఐడీలనూ పంపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి 2020-21లో 2,57,805 మంది, 2021-22లో 3,56,107 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి తాజాగా నివేదిక ఇచ్చింది. మొత్తం 1322 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. 2019 నుంచి 2022 మార్చి 31 వరకు ఈ పథకం కోసం రూ.2210.50 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే గతేడాది ఆరోగ్యశ్రీ కింద దవాఖానాల్లో అదనంగా లక్ష మంది వైద్య సేవలు పొందారు. 2020-21తో పోల్చితే 2021-22లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందిన వారు 8శాతం దాకా పెరగ్గా, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 9శాతం వరకూ తగ్గారని ఆ నివేదిక తెలిపింది. 


గాంధీలో రూ.100కోట్లతో సదుపాయాలు

అడ్డగుట్ట/సిటీబ్యూరో: గాంధీ, పేట్లబురుజు, వరంగల్‌ ఆస్పత్రుల్లో రూ.7.50కోట్ల వ్యయంతో సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో రూ.13 కోట్లతో ఏర్పాటు చేసిన ఎమ్మారై స్కాన్‌ యంత్రాన్ని, రూ.9 కోట్ల వ్యయంతో క్యాథ్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన యంత్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అలాగే, గాంధీ ఆస్పత్రి సెల్లార్‌లో డైట్‌ క్యాంటీన్‌ వద్ద రూ.2.70 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. పిల్లలు కలగని దంపతుల నుంచి ప్రైవేట్‌ ఫెర్టిలిటీ కేంద్రాలు అధిక మొత్తంలో ఫీజులు తీసుకుంటున్నాయన్నారు. గాంధీలో రూ.2.50 కోట్లతో రూపుదిద్దుకుంటున్న సంతా న సాఫల్య కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. కార్పొరేట్‌కు దీటుగా ఇక్కడ సేవలు అందిస్తామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్‌, చెస్ట్‌, ఎంజీఎం, ఈఎన్‌టీ, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ ఆస్పత్రులకు 21 సిటీ స్కాన్‌ యంత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. వైద్య యంత్రాల నిర్వహణ కోసం తొలిసారిగా రూ.20 కోట్లతో బయోమెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ మెయింటనెన్స్‌ పాలసీని తీసుకొస్తున్నామని, తద్వారా ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో మొత్తం రూ.100కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, సదుపాయాలు సమకూర్చుతున్నట్లు తెలిపారు.


రూ.30కోట్ల వ్యయంతో స్టేట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, గాంధీ ఆస్పత్రికి ఉదయం 12.03 గంటలకు రావాల్సిన  మంత్రి హరీష్‌రావు ఎవరికి తెలియకుండా ఉదయాన్నే 1.045 గంటలకు ఆస్పత్రిలో అడుపెట్టారు. ఒక్కసారిగా వైద్యులు అవాక్కయ్యారు. నేరుగా సూపరింటెండెంట్‌ చాంబర్‌కు వెళ్లిన మంత్రి లేబర్‌ వార్డు, ఆర్థోపెడిక్‌ సర్జికల్‌ వార్డులు, ఇతర వార్డులో తిరిగి చికిత్స పొందుతున్న రోగులను పలకరించారు. కార్యక్రమంలో టీఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ ఫారుక్‌ హుస్సేన్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T09:20:08+05:30 IST