ఆరోగ్య సంజీవని గరిష్ఠ పరిమితి పెంపు

ABN , First Publish Date - 2020-07-08T06:26:36+05:30 IST

ఆరోగ్య సంజీవని పాలసీ కింద బీమా కంపెనీలు ఇక నుంచి రూ.5 లక్షలకు పైబడి కూడా పాలసీలు అంగీకరించవచ్చు. వాస్తవానికి గతంలో పాలసీదారుల కనీస ఆరోగ్య బీమా అవసరాలు తీర్చే లక్ష్యంతో...

ఆరోగ్య సంజీవని గరిష్ఠ పరిమితి పెంపు

న్యూఢిల్లీ: ఆరోగ్య సంజీవని పాలసీ కింద బీమా కంపెనీలు ఇక నుంచి రూ.5 లక్షలకు పైబడి కూడా పాలసీలు అంగీకరించవచ్చు. వాస్తవానికి గతంలో పాలసీదారుల కనీస ఆరోగ్య బీమా అవసరాలు తీర్చే లక్ష్యంతో  ఐఆర్‌డీఏఐ జారీ చేసిన ‘‘ప్రామాణిక వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ’’ మార్గదర్శకాల ప్రకారం కనిష్ఠ మొత్తం రూ.1 లక్ష నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షల వరకే పరిమితి విధించారు. మంగళవారం  ఆ మార్గదర్శకాలను సవరిస్తూ లక్షకు లోబడి, రూ.5 లక్షలకు పైబడి కూడా పాలసీలు అంగీకరించే స్వేచ్ఛ ఇచ్చినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది. తక్షణం బీమా కంపెనీలు నవీకరించిన పాలసీలు విడుదల చేసేందుకు కూడా అనుమతిచ్చిం ది. ఆరోగ్య సంజీవని పాలసీ కింద హాస్పిటలైజేషన్‌ చార్జీలతో పాటు ఆస్పత్రిలో చేరేందుకు ముందు, వెనుక చేసిన వ్యయాలు, ఆయుష్‌ చికిత్సలు, కాటరాక్ట్‌ ఆపరేషన్లకు ఆరోగ్య సంజీవని వర్తిస్తుంది. 


Updated Date - 2020-07-08T06:26:36+05:30 IST