ఆరోగ్య భద్రత ఎక్కడ ?

ABN , First Publish Date - 2022-01-19T04:20:17+05:30 IST

కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మాస్కు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆరోగ్య భద్రత ఎక్కడ ?
పాఠశాలల్లో కానరాని కొవిడ్‌ నిబంధనలు

అమలు కాని కొవిడ్‌ నిబంధనలు

పాఠశాలల్లో పొంచి ఉన్న కరోనా ముప్పు

స్కూల్‌ గ్రాంట్స్‌ ఏమయ్యాయో...?

ఉన్నా ఖర్చు చేయని వైనం

మరి కొన్ని చోట్ల నిధులే లేవు



నెల్లూరు (విద్య) జనవరి 18 : కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉంది. కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. మాస్కు లేకుండా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ  జిల్లాలోని పాఠశాలల్లో మాత్రం ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదు. మాస్కు లేకుండా విద్యార్థులు, ఉపాధ్యా యులు స్కూళ్లకు హాజరవుతున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడానికి శానిటైజర్లు కూడా వాడడం లేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ అసలు ఉండడం లేదు. భౌతికదూరం పాటించేలా విద్యార్థులను కూర్చోబెట్టాలంటే గదుల కొరత వేధిస్తోంది. స్కూల్‌ గ్రాంట్స్‌ నుంచి శానిటైజర్లు కొనుగోలు చేసుకోవచ్చని ఉత్తర్వులు ఉన్నా, అవి ఎక్కడా అమలు కావడంలేదు. మరికొన్ని పాఠశాలలకు అసలు నిధులే మంజూరు కాలేదు.


తల్లిదండ్రుల ఆవేదన


జిల్లాలో 3,334 ప్రభుత్వ పాఠశాలల్లో నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో జిల్లాలో కరోనా కేసులు కూడా పెరుగు తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు వీటిపై దృష్టి సారించకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస నిబంధనలైన సామాజిక దూరం, శానిటైజర్‌ వినియోగం, మాస్క్‌ధారణ, థర్మల్‌ స్ర్కీనింగ్‌లు కూడా ఏ పాఠశాలలో అమలు కావడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది సిబ్బంది స్వల్ప లక్షణాలతోనే పాఠశాలలకు హాజరవుతున్నారు. దీంతో తమ పిల్లలకు ఎక్కడా కొవిడ్‌ వ్యాప్తి చెందుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో నిర్వహణకు నిధులు విడుదల కాలేదని, దీని కారణంగా పూర్తిస్ధాయిలో ఏర్పాట్లు చేయలేకపోతున్నామని ఉపాధ్యాయులు  చెప్పడం విశేషం.


స్కూల్‌ గ్రాంట్స్‌ ఏమయ్యాయి ?


ప్రతిఏటా పాఠశాలల ప్రారంభంలో స్కూల్‌, మేనేజ్‌మెం ట్‌, టీచర్స్‌ గ్రాంట్స్‌, ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఇతరత్రా నిధులను విడుదల చేస్తారు.  ఈ విద్యాసంవత్సరంలో జిల్లాలోని 3,334 పాఠశాలలకు రూ.7,96,800ల నిధులను విడుదల చేశారు. ఎలిమెంటరీ, యూపీ స్కూళ్లకు రూ. 5, 56, 500లు, 425 ఉన్నత పాఠశాలలు, కళాశాలలకు కలిపి రూ.2,40,750 లు నిధులు విడుదలయ్యాయి. ఈ నిధులతో 20 మందిలో పు విద్యార్థులు ఉంటే రూ.10వేలు, 50 మందిలోపు ఉంటే రూ.25వేలు, 100 మంది ఉంటే రూ.50వేలు, ఆపైన విద్యా ర్థులుంటే రూ.75వేలు వరకు కరోనా కట్టడికి స్కూల్‌ గ్రాం ట్స్‌ నిధులు వాడుకోవచ్చని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో థర్మామీటర్‌, శానిటైజర్లు, రసా యనాలు కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లో సంబంధిత ప్రధానోపాధ్యాయు లు నేరుగా వీటిని వాడుకోవచ్చు. పురపాలక పాఠశాలల్లో అయితే కమిషనర్‌ నుంచి ప్రధానోపాధ్యాయుల ఖాతాలకు నిధులను మళ్లిస్తారు. అయితే ఈ నిధులు పీడీ ఖాతాల్లో ఉన్నట్లు చూపుతున్నా, జిల్లాలో నిధులు  ఎక్కడా అందలే దని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో వెం టనే నిధులు విడుదల చేయాలి. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


 ఆరుగురు వైద్యులకు కరోనా


గూడూరు, జనవరి 18:  గూడూరులోని ఏరియా ఆసుపత్రిలో ఆరుగురు వైద్యులకు కొవిడ్‌ సోకినట్లు తెలియడంతో మంగళవారం పట్టణంలో కలకలం రేగింది. పట్టణ ప్రజలు ఆర్‌టీ పీసీఆర్‌ ద్వారా పరీక్షలు చేసుకోగా ఐదు కేసులు నమోదు అయినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. 


సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో కరోనా


కోట, జనవరి 18 : కోటలోని సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాల యంలో మంగళవారం కరోనా కలకలం రేపింది. దీంతో సిబ్బందంతా విధులకు హాజరుకాకుండా కార్యాలయానికి రెండు రోజులపాటు సెలవు ఇస్తున్నామంటూ తాళాలు వేశారు. ఇక్కడ సబ్‌రిజిసా్ట్రర్‌గా పనిచేస్తున్న మహిళా అఽఽధికారిణికి కరోనా నిర్ధారణ కావడంతో అటు కార్యాలయ సిబ్బంది, ఇటు పలు పనులపై వచ్చే రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. దీంతో పలువురు సిబ్బంది హోమ్‌ క్వారంటైనకు వెళ్లినట్లు సమాచారం.


జిల్లాలో 246 కరోనా కేసులు


నెల్లూరు(వైద్యం) జనవరి 18 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం 246 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,49,662కి చేరాయి. కరోనా కారణంగా ఎవరూ మృత్యువాత పడలేదు. అలాగే కరోనా నుంచి కోలుకున్న 19 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు. జిల్లా వాప్తంగా మొత్తం 25,757 మందికి వాక్సిన వేశారు. 95 కేంద్రాల ద్వారా జరిగిన వ్యాక్సినేషనలో 321 మంది వైద్య సిబ్బందిని పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-19T04:20:17+05:30 IST