ఆరోగ్యంపై అవగాహన పెరగాలి

ABN , First Publish Date - 2021-11-22T06:40:51+05:30 IST

ఆరోగ్యంపై అవగాహన పెరగాలి

ఆరోగ్యంపై అవగాహన పెరగాలి
వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న పుట్టగుంట సతీష్‌కుమార్‌

 హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 21 : గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ వారిలో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన పెంచాలనే ఉద్దేశంతో  పుట్టగుంట వెంకట సతీష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ద్వారా ఉచిత  వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆ ఫౌండేషన్‌ చైర్మన్‌ పుట్టగుంట సతీష్‌కుమార్‌ తెలిపారు.  ఆదివారం స్థానిక లయన్స్‌ క్లబ్‌లో పుట్టగుంట వెంకట సతీష్‌ హెల్త్‌ ఫౌండేషన్‌, గుడివాడ ఈవీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, హనుమాన్‌జంక్షన్‌ లయన్స్‌ క్లబ్‌  సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబి రంలో 110 మందికి వైద్యపరీక్షలు జరిపి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో లయన్స్‌ హెల్త్‌ క్యాంప్స్‌ జిల్లా కో- ఆర్డినేటర్‌ జి. చంద్రశేఖర్‌రావు, లయన్స్‌ మాజీ గవర్నర్‌ వీరమాచనేని రామబ్రహ్మాం, లయన్స్‌ నాయకులు చలసాని వెంకటేశ్వ రరావు, నందిగం స్వామి, లింగంనేని రాజారావు, మూల్పూరి సురేంద్ర, కలపాల రంగారావు, మాకినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. గుడివాడ ఈవీఆర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్‌ ఈడ్పుగంటి రాజ్యలక్ష్మి పర్యవేక్షణలో వైద్యు లు సురేష్‌బాబు, రఘువర్మ, రాజేంద్ర, దుర్గాదేవి  వైద్యసేవలు అందించారు. 

Updated Date - 2021-11-22T06:40:51+05:30 IST