Abn logo
May 8 2021 @ 10:22AM

చిన్నారుల స్కూల్ బస్సును హైజాక్​ చేసిన ఆర్మీ ట్రైనీ..

కొలంబియా: అమెరికాలో ఓ ఆర్మీ ట్రైనీ చిన్నారుల స్కూల్ బస్సును హైజాక్ చేసిన ఘటన కలకలం సృష్టించింది. కొలంబియాలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివారల్లోకి వెళ్తే.. జోవన్ కొల్లాజో(23) అనే ఓ ఆర్మీ ట్రైనీ శుక్రవారం ఉదయం చిన్నారులు ప్రయాణిస్తున్న స్కూల్ బస్సును హైజాక్​ చేశాడు. ఘటనా సమయంలో బస్సులో 18 మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం. మొదట డ్రైవర్​ను తుపాకీతో బెదిరించి బస్సు ఎక్కాడు. అనంతరం డ్రైవర్​కు బస్సును మరో ప్రాంతానికి తీసుకెళ్లాలని జోవన్ బెదిరించినట్లు కొలంబియా పోలీస్ అధికారి లియోన్​ లాట్​ తెలిపారు. ఈ క్రమంలో బస్సులోని పిల్లలు వేసిన వింత ప్రశ్నలు, వారి అరుపులతో అతనికి ఏం చేయాలో తోచలేదు. దాంతో కొద్ది దూరం వెళ్లిన తర్వాత పిల్లలను, డ్రైవర్​ను దింపేసి బస్సుతో పరారయ్యాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటికే జోవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement