ఆర్మీలో నియామకాలకు రిక్రూట్ మెంట్ ర్యాలీ

ABN , First Publish Date - 2021-11-08T21:49:33+05:30 IST

ఆర్మీలో నియామకాల కోసం సికింద్రాబాద్ (తెలంగాణ) ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (ఏఓసీ) లో ఈ నెల 29న రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు.

ఆర్మీలో నియామకాలకు రిక్రూట్ మెంట్ ర్యాలీ

హైదరాబాద్: ఆర్మీలో నియామకాల కోసం సికింద్రాబాద్ (తెలంగాణ) ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (ఏఓసీ) లో ఈ నెల 29న రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద సోల్జర్ టెక్ ( ఏఈ), సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్ మెన్, అత్యుత్తమ క్రీడాకారులు (ఓపెన్ కేటగిరీ), సోల్జర్ సీఎల్కే/ఎస్కెటీ ( ఏవోసి వార్డు మాత్రమే) తరగతుల్లో నియామకాలు చేపట్టడానికి సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లోని ఏబీసీ ట్రాక్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు (ఓపెన్ కేటగిరి) క్రీడల ఎంపిక కోసం 2021 నవంబర్ 26న సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ లో తాపూర్ స్టేడియంకు ఉదయం 8 గంటలకు రావలసి ఉంటుందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 


బాక్సింగ్, ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, స్విమ్మింగ్, రెజ్లింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ, క్రికెట్‌లో దేనిలోనైనా ప్రాతినిధ్యం వహించిన అత్యుత్తమ క్రీడాకారులు తమ సర్టిఫికేట్‌తో పాటు పాల్గొనవచ్చు.కాగా  స్క్రీనింగ్ తేదీ నాటికి సర్టిఫికేట్ రెండు సంవత్సరాల కంటే పాతది కాకూడదని అధికారులు పేర్కొన్నారు. అర్హతల విషయానికి వస్తే సోల్ జీడీ  - వయోపరిమితి 17.6 నుంచి 21 సంవత్సరాలు. సోల్ టెక్ (ఏఈ),సోల్ సీఎల్కే/ఎస్కెటీ  వయోపరిమితి 17.6 నుంచి 23 సంవత్సరాలుగా నిర్ణయించారు.


ఆయా పొస్టులకు మెట్రిక్యులేషన్/ ఎసిఎస్సీ ప్రతి సబ్జెక్టులో కనీసం 33%  మొత్తంగా 45%. అర్హతలుగా నిర్ణయించారు. ఇతర వివరాల కోసం అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ ఏవోసీ సెంటర్, తూర్పు మారేడ్‌పల్లి, తిరుమలగిరి , సికింద్రాబాద్ (టీఎస్) 500015, హెడ్‌క్వార్టర్స్ ఏవోసీ సెంటర్ ఇ-మెయిల్  airawat0804@nic.in ,  www.joinindianarmy@nic.in సైట్ ల ద్వారా రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించి  మరింత సమాచారం కోసం తెలుసుకోవచ్చని తెలిపారు. 

Updated Date - 2021-11-08T21:49:33+05:30 IST