Abn logo
Jul 24 2021 @ 09:33AM

Jammu and Kashmir: మందుపాతర పేలి జవాన్ మృతి

ఫూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని ఫూంచ్ జిల్లాలోని మాన్‌కోటి కృష్ణ ఘాటీ సెక్టారు అంతర్జాతీయ సరిహద్దు వద్ద శనివారం మందుపాతర పేలిన దుర్ఘటనలో ఓ భారత జవాన్ అమరుడయ్యారు. సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేస్తున్న ఓ జవాన్ మందుపాతరపై కాలు వేయగా అది కాస్తా పేలింది. ఈ దుర్ఘటనలో ఆర్మీజవాన్ అక్కడిక్కడే మరణించారు.మృతుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని హమీర్ పూర్ గ్రామానికి చెందిన కృష్ణ వైద్య అని గుర్తించారు. సరిహద్దుల్లో గస్తీ తిరుగుతూ మందుపాతర పేలి అమరుడైన సిపాయి కృష్ణ వైద్యకు భారత సైనికులు నివాళులు అర్పించారు.కృష్ణ ఘాటీ సెక్టారులో డమ్మీ ఏరోప్లేన్ బెలూన్ లభించింది.