Abn logo
Nov 26 2021 @ 11:50AM

సరిహద్దుల్లో చొరబాటు యత్నం భగ్నం...Pakistani terrorist హతం

జమ్మూ: జమ్మూ కశ్మీర్‌ పూంచ్‌లోని భింబర్ గలి ప్రాంతంలో గురువారం అర్థరాత్రి పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది.భీంబర్ గలి ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేసేందుకు భారత ఆర్మీ అధికారులు గురువారం అర్థరాత్రి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు.సరిహద్దుల్లో మరణించిన ఉగ్రవాది నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భారతసైనికులు స్వాధీనం చేసుకున్నారు.

భట్టా దుర్రియన్ అడవుల్లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు పూంచ్ జిల్లాలో కూంబింగ్, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయని జమ్మూ కాశ్మీర్ పోలీసు చీఫ్ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు.జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లను పెంచడానికి పాకిస్తాన్ వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే వాటిలో ఎక్కువ భాగం విఫలమవుతున్నాయని దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.భట్టా దుర్రియన్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు.