కాశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

ABN , First Publish Date - 2022-03-11T20:11:55+05:30 IST

భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కాశ్మీర్ ప్రాంతంలో కూలిపోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో తులైల్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం హెలికాప్టర్ కూలినట్లు అధికారులు తెలిపారు.

కాశ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్

భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ ఒకటి కాశ్మీర్ ప్రాంతంలో కూలిపోయినట్లు సైనికాధికారులు వెల్లడించారు. ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో తులైల్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం హెలికాప్టర్ కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పైలట్, కో-పైలట్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి వెళ్లిందని, భద్రతా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్‌తో కమ్యూనికేషన్ తెగిపోయిందని, దీంతో తాము తదుపరి చర్యలు తీసుకున్నామని స్థానిక సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ అధికారి చెప్పారు.

Updated Date - 2022-03-11T20:11:55+05:30 IST