Uttar Pradeshలో అక్రమ ఆయుధాల తయారీ కర్మాగారం గుట్టురట్టు

ABN , First Publish Date - 2022-01-21T18:04:38+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ ఆయుధ కర్మాగారం గుట్టును పోలీసులు రట్టు చేశారు....

Uttar Pradeshలో అక్రమ ఆయుధాల తయారీ కర్మాగారం గుట్టురట్టు

లక్నో : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ ఆయుధ కర్మాగారం గుట్టును పోలీసులు రట్టు చేశారు. మధుర నగరంలోని దౌలత్ పూర్ ప్రాంతంలో అక్రమంగా ఆయుధాలను తయారు చేస్తున్న కర్మాగారాన్ని పోలీసులు గుర్తించారు. అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధ కర్మాగారంలో 8 పిస్టళ్లు, 4 తుపాకులు, 13 లైవ్ రౌండ్లు, ఇతర ఆయుధాల తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీలో అక్రమ ఆయుధాలకు డిమాండ్ పెరిగింది. దీంతో పోలీసులు దాడి చేసి అక్రమ ఆయుధ కర్మాగారాన్ని మూసివేయించినట్లు ఎస్పీ గౌరవ్ గ్రోవర్ చెప్పారు. 


Updated Date - 2022-01-21T18:04:38+05:30 IST