Abn logo
Aug 11 2020 @ 09:02AM

కశ్మీర్‌లో తుపాకులు, మందుగుండు సామాగ్రి స్వాధీనం..ముగ్గురి అరెస్ట్

Kaakateeya

కుప్వారా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భారత సైనికులు ఉగ్రవాదుల రహస్య స్థావరం నుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చినార్ కార్ఫ్ విభాగానికి చెందిన సైనికులు జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి కుప్వారా లాల్ పురా ప్రాంతాల్లో సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఉగ్రవాదుల స్థావరం నుంచి ఒక ఏకే 47 రైఫిల్, రెండు పిస్టళ్లు, మేగజైన్లు, మందుగుండు సామాగ్రి దొరికాయి. తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న జవాన్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని ప్రశ్నిస్తున్నామని, ఈ ఆయుధాలు ఉగ్రవాదులవేనని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement