పకడ్బందీగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-10T11:14:08+05:30 IST

జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ కొనసాగు తోంది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి ప్రజలకు

పకడ్బందీగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌9: జిల్లాలో పకడ్బందీగా లాక్‌డౌన్‌ కొనసాగు తోంది. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి ప్రజలకు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అవకాశం ఇవ్వడంతో ఆ సమయంలో మాత్రమే ప్రజలు పట్టణానికి బారులు తీరుతున్నారు. దీంతో పోలీసు బందోబస్తు మధ్య పట్టణంలో సరుకులను కొనుగోలు చేస్తున్నారు.    పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కలెక్టర్‌ నిత్యావసర సరుకులు, మెడికల్‌ అవసరాల నిమిత్తం వస్తున్న ప్రజలు దుకాణా సముదాయల వద్ద సామాజిక దూరం పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. పోలీసులు సైతం లాక్‌డౌన్‌ను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


బారికేడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

కాలనీల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న శాంతినగర్‌లో కాలినడకన వెళ్లి పరిశీలించారు. కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సహకరించాలని కోరారు.


రిమ్స్‌లో టన్నెల్‌ స్ర్పేయింగ్‌ మిషన్‌  ప్రారంభించిన కలెక్టర్‌

రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ టన్నెల్‌ స్పేయింగ్‌ మిషన్‌ను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. గురువారం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఇన్ఫెక్షన్‌ టన్నెల్‌ స్ర్పేయింగ్‌ మిషన్‌ను ప్రారంభించారు. ఈ మిషన్‌ను ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే మూడోదని తెలిపారు. ఈ సందర్భంగా మిషన్‌ను ఏర్పాటు చేసినందున జోగు ఫౌండేషన్‌కు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ రిమ్స్‌కు వచ్చే ప్రతి రోగి ఇన్పెక్షన్‌ టన్నెల్‌ స్ర్పేయింగ్‌ మిషన్‌ నుంచి వెళ్లాలని సూచించారు. సుమారు రూ.40లక్షలతో జోగు ఫౌండేషన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌, రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ పాల్గొన్నారు.


కరోనా బాధిత కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలింపు

మర్కజ్‌లోని నిజాముద్దీన్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించగా గురువారం వారి కుటుంబ సభ్యులను ఉట్నూర్‌ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా.మనోహర్‌ ఆధ్వర్యంలో మరికొంత మందిని క్వారంటైన్‌కు తరలించారు. సుమారు 15 మందిని ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా తరలించి వారి రక్తనమూనాలను సేకరించి గాంధీ ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-04-10T11:14:08+05:30 IST