గోసంతతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2022-06-26T06:20:30+05:30 IST

ప్రణాళికబద్దమైన విధానాల ద్వారా భైంసా డివిజన్‌ పరిధిలో గో సంతతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని గో సేవా - గో సంరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ నూకల సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గోసంతతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
వినతిపత్రం అందచేస్తున్న గో సంరక్షణ ప్రతినిధులు

భైంసా, జూన్‌ 25 : ప్రణాళికబద్దమైన విధానాల ద్వారా భైంసా  డివిజన్‌ పరిధిలో గో సంతతిని కాపాడేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని గో సేవా - గో సంరక్షణ  కమిటీ జిల్లా కన్వీనర్‌ నూకల సురేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సంబంధిత విషయమై శనివారం భైంసా ఆర్‌డీవో కార్యా లయం, అడిషనల్‌ ఎస్పీ కార్యాలయం, పట్టణ పోలీసు సీఐ కార్యాలయాల్లో  క మిటీ అధ్వర్యంలో వినతిపత్రాలు అందచేసారు ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో   గోసేవా - గోసంరక్షణ  కమిటీ జిల్లా కన్వీనర్‌ నూకల సురేష్‌  మాట్లాడారు. వచ్చే నెలలో రెండవవారంలో బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించు కొని గోవుల అక్రమ రవాణా, గోవులపై దాడులు, గోవులవధ అధికంగా జరిగే పరిస్థితులు ఉన్నయన్నారు. రెవెన్యూ, పోలీసు అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే గోవుల అక్రమరవాణాను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు గాను చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రధానప్రాంతాల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి గోసంతతి రవాణ జరుకుండా చూడాలన్నారు.  ఇదే క్రమంలో బక్రీద్‌  పర్వ దినం జరిగే రోజుల్లో గోవధలు జరుగనున్నాయని పేర్కొన్నారు. వీటి నివారణకు గాను ముందస్తు కఠిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందులో గోసేవా- గోసంరక్షణ ప్రతినిధులతో భైంసా డివిజన్‌ బీజేపీ ప్రతినిధులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:20:30+05:30 IST