పాయకరావుపేటలో పకడ్బందీగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-12T05:14:33+05:30 IST

కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాపారులు చేపట్టిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌తో పాటు పోలీసులు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో ఏడు రోజులుగా పాయకరావుపేట పట్టణం నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది.

పాయకరావుపేటలో పకడ్బందీగా లాక్‌డౌన్‌
ఉదయం పది గంటలకే ఖాళీ అయిన తాండవ వంతెన

నిర్మానుష్యంగా రహదారులు.. కళ తప్పిన పట్టణం

పాయకరావుపేట, మే 11:
కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాపారులు చేపట్టిన స్వచ్ఛంద లాక్‌డౌన్‌తో పాటు పోలీసులు పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తుండడంతో ఏడు రోజులుగా పాయకరావుపేట పట్టణం నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకే కిరాణా, కూరగాయల దుకాణాలు మూసి వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు రంగంలోకి దిగుతుండడంతో పట్టణంలో రోడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి. ఇక వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు పాయకరావుపేట పీహెచ్‌సీకి అధిక సంఖ్యలో వస్తున్న ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదన్న ఆరోపణలతో మంగళవారం పీహెచ్‌సీ ఆవరణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-05-12T05:14:33+05:30 IST