Abn logo
Sep 19 2021 @ 00:46AM

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు

ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామారావు


బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బంధీగా ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎం.రామారావు తెలిపారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ, మండలంలో జడ్పీటీసీతో పాటు 19 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కోసం శనివారం మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించామన్నారు. ఏజెంట్ల పూర్తి వివరాలను తీసుకున్నామన్నారు. దిబ్బిడి జడ్పీ హైస్కూల్‌లో కొవిడ్‌ నిబంధనల మేరకు కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు ప్రారంభించి, సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తామన్నారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కాగా, కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ విధించామని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ బి.రామకృష్ణ హెచ్చరించారు.