శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు

ABN , First Publish Date - 2022-05-25T04:17:47+05:30 IST

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్‌ రూంను మంగళవారం తనిఖీ చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు
పోలీసు వాహనాలు పరిశీలిస్తున్న ఎస్పీ సురేష్‌

- ఎస్పీ కె సురేష్‌కుమార్‌ 

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 24: జిల్లాలో  శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు  తీసుకుంటున్నామని ఎస్పీ కె సురేష్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల కమాండ్‌ కంట్రోల్‌ రూంను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో 16 సీసీ కెమెరాలు ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనలు గుర్తించేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు. 110 సీసీ కెమెరాలు లా అండ్‌ అర్డర్‌ కంట్రోల్‌ కోసం ఏర్పాటు చేసినట్లు వివరించారు.  వీటి ద్వారా ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘించిన వాహనాలకు ఆటోమెటిక్‌గా చలాన్‌ జనరేట్‌ అవుతుందని చెప్పారు. ప్రజలు కచ్చితంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమె రా లను ఏర్పాటు చేశామని చెప్పారు. నేరస్తులను తొందరగా గుర్తించేం దుకు ఫింగర్‌ ఫ్రింట్స్‌ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు. 

- పోలీసు వాహనాల పరిశీలన

 పోలీసు శాఖకు సంబందించిన వాహనాల స్థితిగతులను ఎస్పీ కె సురేష్‌కుమార్‌ మంగళ వారం పరిశీలించారు. ఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లోని వాహనాలకు సంబందించిన పత్రాలు, కండీష న్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతి రోజు వాహనం యొక్క కండీషన్‌ పరిశీలించాలని సూచించారు. ఎప్పటి కప్పుడు వాహనాలలో అయిల్‌, బ్యాటరీ తదితర కండీషన్లను గమ నించాలని చెప్పారు.. డ్రైవ్లు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచిం చారు.  ట్రాఫిక్‌లో వెళ్లేప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.  వాహ నాల్లో సమస్య తలెత్తితే మరమ్మతు చేయించాలని సూచించారు.

Updated Date - 2022-05-25T04:17:47+05:30 IST