పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-18T05:52:06+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పకడ్బందీ గా చేస్తున్నది.

పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
ప్రత్యేక తరగతుల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థినులు

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం మే 17: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పకడ్బందీ గా చేస్తున్నది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా  పరీక్షలు లేకుండానే విద్యార్థులను ప్రమోట్‌ చేశారు.  ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సిలబస్‌ను 70 శాతం  కుదించి సెప్టెంబరు నెల నుంచి  ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు.  గతంలో పదోతరగతి విద్యార్థులకు  11 పేపర్లు ఉండేది. ఈ ఏడాది ఏడు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నా రు. ఈ పరీక్షలు ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అఽధికారులు పరిశీలిస్తున్నా రు.  పరీక్షల సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది.  పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద తాగునీరు, విద్యుత్‌, సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని ఉన్నాతాధికారులు ఆదేశిం చారు.   ప్రతీ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు.

 విద్యార్థులకు అవగాహన

పదోతరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వ హిస్తున్నారు. పాఠశాలకు వేసవి సెలవులు ప్రకటించినా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో రెండున్నర గంటల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఆదివారం ఉద యం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పరీక్షకు సంబంధించి దూరదర్శన్‌లో ప్రసారమయ్యే కార్య క్రమాన్ని ప్రతీ విద్యార్థి వీక్షించాలని ఉపాధ్యాయులు సూ చిస్తున్నారు.  అదేవిధంగా విద్యార్థులు చదువుతున్న పాఠ శాలల్లో, అన్‌లైన్‌లో హాల్‌టికెట్లు తీసుకునే అవకాశం కల్పించారు.  పది పరీక్షలకు సంబంధించి ఏలాంటి సందే శాలు ఉన్న నివృతి చేసుకునేందకు త్వరలోనే ప్రత్యేక సెల్‌ ని కూడా ఎర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో.. 

జిల్లాలోని 16 మండలాల్లో 13,242 మంది విద్యార్థులు పరీ క్షలకు హాజరుకావాల్సి ఉన్నది. ఇందుకు గాను 59 పరీక్ష కేంద్రాలు ఎర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 59 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 59 మంది డిపార్ట్‌ మెంట్‌ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, రూట్‌ ఆఫీసర్‌, ఇన్విజిలేటర్లను నియమించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో..

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాల్లో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలు 11,060 మంది విద్యార్థులు రాయనుండగా అందులో 5,562 మంది బాలురు, 5,498 మంది బాలికలు ఉన్నారు. కేంద్రానికి ఒకరి చొప్పున 63 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 63 మంది డిపార్టుమెంటల్‌ అధికారులుతో పాటు 560 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు.   

నారాయణపేట జిల్లాలో..

నారాయణపేట : నారాయణపేట జిల్లాలో  పదో తరగతి పరీక్ష కేంద్రా లు 38 ఏర్పాటు చేశారు.  మొత్తం 8,099 మంది విద్యార్థులు  పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను అమలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలో భాగం గా జిరాక్స్‌ కేంద్రాలను మూసివేసేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. ఎక్కడైనా పదో తరగతి పరీక్ష కేంద్రానికి ప్రహరీ లేకపోతే పోలీస్‌ సిబ్బం దిని పెంచి పటిష్ట బందోబస్తును నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు.

   వనపర్తిలో..

వనపర్తి రూరల్‌ :  పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు వనపర్తి జిల్లాలో  35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 7,311 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించనున్నారు.

గద్వాలలో..

గద్వాల టౌన్‌ : జిల్లాలో 41 పరీక్ష కేంద్రాలను  ఏర్పాటు చేశారు.  పరీక్షలకు 8,041మంది రెగ్యులర్‌,  మరో 28మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు.  ఇందుకోసం 41 కేంద్రాల్లో ప్రతీ కేంద్రానికి ఒక సెంటర్‌ సూపరిన్‌టెండెంట్‌, మరో డిపార్ట్‌మెంటల్‌ అధికారితో పాటు ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు.  ప్రతీ సెంటర్‌లో ఇద్దరు చొప్పున వైద్య ఆరోగ్యశాఖకు చెందిన జిల్లా వ్యాప్తంగా 82మందిని నియమించారు.

Updated Date - 2022-05-18T05:52:06+05:30 IST