‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-16T06:32:36+05:30 IST

ఈ నెల 23 నుంచి జూన్‌ 1వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. పరీక్ష విధానం, విద్యార్థుల సందేహాలు, పరీక్షల నిర్వహణలో భద్రత, సౌకర్యాలు తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వివరించారు.

‘పది’కి పకడ్బందీ ఏర్పాట్లు
డీఈవో భిక్షపతి

 సందేహాలకు 24గంటల హెల్ప్‌డెస్క్‌ 

 అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి 

 సీసీ కెమెరాల పర్యవేక్షణ, జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు 

 ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో డీఈవో భిక్షపతి 

నల్లగొండ, మే 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ నెల 23 నుంచి జూన్‌ 1వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో భిక్షపతి తెలిపారు. పరీక్ష విధానం, విద్యార్థుల సందేహాలు, పరీక్షల నిర్వహణలో భద్రత, సౌకర్యాలు తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో వివరించారు.

ఆంధ్రజ్యోతి: పదో తరగతి పరీక్షలకు ఎంత మంది హాజరవుతున్నారు? 

డీఈవో: కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి 19,910 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షకు హాజరవుతున్నారు. ఇందులో ప్రైవేటు అభ్యర్థులు 8మంది కాగా ఒకేషనల్‌ 970మంది ఉన్నారు. మొత్తం 107 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఇందులో 13 కేంద్రాలు సీ సెంటర్స్‌ విభాగంలో ఉన్నాయి. అంటే అక్కడ పోలీస్‌ స్టేషన్‌, పోస్టాఫీస్‌ కానీ ఉండవు. సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ లేదా పో స్టాఫీస్‌ నుంచి మెటీరియల్‌ను సంబంధిత సెంటర్‌ అధికారులు తీసుకుని రావాల్సి ఉంటంది. 

ఆంధ్రజ్యోతి: నిర్వహణలో పారదర్శకత, భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

డీఈవో: ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జ రుగుతాయి. గంట ముందు కస్టోడియన్లు పోలీస్‌ స్టేషన్ల నుంచి పరీక్ష పత్రాలు భద్రతా సిబ్బంది మధ్యన తీసుకుని పరీక్ష కేంద్రానికి చేరుకుంటారు. పరీక్ష కేం ద్రంలో త్రీమెగా పిక్సల్‌, 180 డిగ్రీల యాంగిల్‌లో పనిచేసే సీసీ కెమెరాల ఎదు ట ఈ పరీక్షపత్రాలను తెరవాల్సి ఉంటుంది. సమయం, భద్రత అన్నీ అంశాలు రికార్డు అవుతాయి. పరీక్షల నిర్వహణ క్రమంలో పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ యాక్ట్‌-25 అమల్లో ఉంటుంది. చిట్టీలు రాయడమే కాదు పక్కన చూడడం, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.  

ఆంధ్రజ్యోతి: మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు? 

డీఈవో: ఈ పరీక్షలు జంబ్లింగ్‌ పద్ధతిలో జరుగుతాయి. ఒక పాఠశాలకు చెం దిన విద్యార్థులు వివిధ కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతీ 20మందికి ఒక ఇన్విజిలేటర్‌, ఒక బెంచీకి ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేశాం. మొత్తం 6 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు జిల్లా వ్యాప్తంగా నిరంతరం, ఆకస్మికం గా పర్యటిస్తాయి. ఈ బృందంలో ఒక ఎంఈవో, రెవెన్యూ సూపరింటెండెంట్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ ఉంటారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థుల సెల్‌ఫోన్లు మాత్రమే కా దు చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు సైతం వారి వ్యక్తిగత సెల్‌ఫోన్లు తీసుకొచ్చేందుకు అనుమతి లేదు.  

ఆంధ్రజ్యోతి: విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు?

డీఈవో: పరీక్షలకు సంబంధించి ఆందోళన, పరీక్ష కేంద్రాలు ఇతర ఏ అంశాలపైన అయినా సందేహాలు నివృత్తిచేసి సహాయం చేసేందుకు జిల్లాకేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. ఇది 24గంటలపాటు పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందుబాటులో ఉంటుంది. సెల్‌:9121212513కు కాల్‌చేసి సేవలు పొందవచ్చు.  

Updated Date - 2022-05-16T06:32:36+05:30 IST