ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-08-07T05:50:20+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు

నిమిషం ఆలస్యమైనా అనుమతించం

ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి


ఆదిలాబాద్‌అర్బన్‌, ఆగస్టు6: తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పరీక్షలకు 3355 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో పరీక్షను నిర్వహించనున్నారని, నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టం చేశారు. హాల్‌ టికెట్‌, పెన్‌, ఒక ఫొటోను మినహాయిస్తే మిగిలిన ఎటువంటి వస్తువులను హాలులోకి అనుమతించరని ప్యాడ్లు, గడియారాలు, సెల్‌ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లతో సహా ఇతరాత్ర వస్తువులను తీసుకురావద్దని సూచించారు. 

మొక్కలు నాటిన ఎస్పీ

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సంగారెడ్డి ఎస్పీ ఎం.రమణకుమార్‌ చేసిన ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఇందులో భాగంగానే శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించడంలో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ చేపట్టి ఐదేళ్లు పూర్తి అయిందన్నారు. అదే విధంగా తను ఈ ఛాలెంజ్‌ను ఆసిఫాబాద్‌, నిర్మల్‌ ఎస్పీ సురేష్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌తో పాటు మంచిర్యాల అడిషనల్‌ డీసీపీ అఖిల్‌ మహాజాన్‌కు చాలెంజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రోఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతిని పురస్కరంచుకుని ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఉమేందర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, శ్రీపాల్‌, వంశీకృష్ణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ గుణవంత్‌రావ్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-08-07T05:50:20+05:30 IST