Oct 28 2021 @ 08:51AM

'సర్కారు వారి పాట': రెట్టింపు ఇవ్వబోతున్న పరశురామ్

దర్శకుడు పరశురామ్ పెట్ల డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ నుంచి అందరూ అనుకుంటున్నదానికంటే రెట్టింపు ఇవ్వబోతున్నాడట పరశురామ్. బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాలు అనే యూనివర్సల్ పాయింట్‌తో, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయం టీజర్‌తో అర్థమయింది. ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసిన 'సర్కారు వారి పాట' బృందం త్వరలో హైదరాబాద్‌లో ఓ లాంగ్ షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. అయితే తాజాగా స్పెయిన్ షెడ్యూల్‌లో మహేశ్ లుక్ ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ "అందరూ అనుకుంటున్నదానికంటే రెట్టింపు ఇవ్వబోతున్నాడు పరశురామ్".. అని ట్వీట్ చేశారు. మ్యూజిక్ అయినా, సినిమా అయినా.. అందరి అంచనాలను మించి ఉండబోతోందని ట్వీట్‌లో థమన్ పేర్కొన్నాడు.