Sep 25 2021 @ 09:22AM

'సర్కారు వారి పాట'.. 'పోకిరి' వైబ్స్‌ని తీసుకొస్తుంది: మహేశ్

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'. ఈ మూవీ డెఫిఎట్‌గా 'పోకిరి' వైబ్స్‌ని తీసుకొస్తుంది అని మహేశ్ అన్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు. ఇప్పటికే దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తైంది. ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ నుంచే మహేశ్ లుక్ మీద పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ పేదేళ్ల వెనక్కి తీసుకువెళ్ళినట్టుందని...అప్పుడే అందరూ 'పోకిరి' సినిమాను గుర్తు చేసుకున్నారు.

తాజాగా ప్రెస్‌మీట్‌లో మహేశ్ ఈ సినిమాకి సంబందించి అడిగిన ప్రశ్నలను సర్‌ప్రైజ్ అయ్యేలా సమాధానమిచ్చారు. ఈ సినిమా డెఫినెట్‌గా 'పోకిరి' వైబ్స్ ని తీసుకొస్తుంది అని, అంతేకాకుండా కేవలం ఒక్క సిట్టింగ్‌లోనే నేను ఈ కథ ఓకే చేసానని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి 'సర్కారు వారి పాట' విషయంలో మహేశ్ ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్ధమవుతోంది. మహేశ్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇక త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీని సెట్స్ మీదకి రాబోతుండగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.