Oct 17 2021 @ 12:11PM

'సర్కార్ వారి పాట': కీర్తి సురేష్‌కు స్పెషల్ బర్త్ డే విషెస్

నేడు (అక్టోబర్ 17) సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రబృందం ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కీర్తి సురేష్ నటిస్తున్న క్రేజీ మూవీస్‌లో 'సర్కారు వారి పాట' ఒకటి. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఇందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్..14 రీల్ ప్లస్.. మైత్రీ మూవీ మేకర్స్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా చిత్ర హీరోయిన్ కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా, ఆమెకు విషెస్ తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హీరో మహేశ్ బాబు, దర్శకుడు పరశురామ్ సహా మిగతా యూనిట్ సభ్యులు కీర్తికి స్పెషల్‌గా విషెస్ తెలిపారు. ఇక 'సర్కారు వారి పాట' మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అణ్ణాత', మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్', నేచురల్ స్టార్ నాని ప్రకటించిన కొత్త సినిమా 'దసరా'లోనూ కీర్తి సురేష్ నటిస్తోంది.