Abn logo
Feb 22 2020 @ 04:31AM

ఉద్యోగుల ప్రశ్నలకు జవాబివ్వరేం?: అర్జునుడు

మూడు రాజధానుల వల్ల ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలపై గత 70 రోజుల్లో ఏనాడన్నా నోరు విప్పారా? 3 చోట్ల కాపురాలు ఉండడం ఎలాగో తెలియక, బిడ్డల చదువులు ఎక్కడో అర్థం కాక జుట్టు పీక్కుంటున్న ఉద్యోగుల ప్రశ్నలకు వైసీపీ నేతలు జవాబివ్వరేమిటని టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిలదీశారు. తుగ్లక్‌ చర్యలతో వచ్చే సమస్యలు, 10 వేలమంది ఉద్యోగుల ఆవేదన మీకు పట్టదా? అని శుక్రవారం ప్రభుత్వాన్ని నిలదీశారు.

Advertisement
Advertisement
Advertisement