Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 09:19:49 IST

Arjun Kapoor: అందుకే మలైకా అరోరాని పెళ్లి చేసుకోడానికి రెడీగా లేను

twitter-iconwatsapp-iconfb-icon

నిర్మాత, వ్యాపారవేత్త బోనీ కపూర్ (Boney Kapoor) తనయుడిగా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor). అనంతరం వరుసగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు పొందాడు. ఈ నటుడు తాజాగా బాలీవుడ్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్(Koffee With Karan)’కి గెస్ట్‌గా వచ్చాడు. ఆరు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఏడో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ షోకి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్నాడు. అందరిలాగే అర్జున్ కపూర్‌ని సైతం శృంగార జీవితం, మలైకా అరోరాతో ప్రేమ, పెళ్లి గురించి పలు ఆసక్తికర ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టాడు.


ఈ షోలో అర్జున్‌ని గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరా (Malaika arora) గురించి కరణ్ కొన్ని ప్రశ్నలు అడిగాడు. తమ బంధాన్ని పబ్లిక్‌గా చేయాలనే నిర్ణయం ఎవరిదని, వారు త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ గురించి కరణ్ అడిగాడు. అర్జున్ మాట్లాడుతూ.. ‘నేను మలైకాని ఇప్పుడే పెళ్లి చేసుకునేందుకు రెడీగా లేను. నిజాయతీగా చెప్పాలంటే.. కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లు పనికి రాకుండా పోయాయి. అందుకే నేను నా కెరీర్ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నా.


నేను చాలా రియలిస్టిక్ వ్యక్తిని కరణ్. ఏది దాచాల్సిన అవసరం లేదు. అందుకే నేనే మొదట మా రిలేషన్‌షిప్‌ని అందరికీ చెబుదామని చెప్పాను. నేను వృత్తిపరంగా కొంచెం స్థిరంగా ఉండాలనుకుంటున్నాను. ఆర్థికంగా మాట్లాడటం లేదు.. మానసిక ఆనందం గురించి మాట్లాడుతున్నాను. నాకు సంతోషాన్ని కలిగించే పనిని చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సంతోషంగా ఉంటేనే.. నా లైఫ్ పార్టనర్‌ని సంతోషపెట్టగలను. నేను సంతోషకరమైన జీవితాన్ని గడపగలను. నా పని నుంచి చాలా ఆనందం లభిస్తుందని నేను భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు.


కాగా.. అర్జున్, మలైక తమ బంధం గురించి రెండేళ్ల క్రితమే అందరితో పంచుకున్నారు. వారు తరచుగా డేటింగ్స్‌కి, ఈవెంట్‌లు, పార్టీలలో కలిసి కనిపిస్తారు. సోషల్ మీడియాలో ఇటీవల ఎక్కువగా వీరి పెళ్లి గురించి రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. అర్జున్ చెప్పిన ఈ మాటలతో వాటికి చెక్ పడినట్లైంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement