జోరుమీదున్న అర్జున్‌

ABN , First Publish Date - 2022-09-22T06:50:53+05:30 IST

జూలియస్‌ బేయర్‌ జనరేషన్‌ క్‌ప ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి జోరు కొనసాగిస్తున్నాడు.

జోరుమీదున్న అర్జున్‌

న్యూయార్క్‌: జూలియస్‌ బేయర్‌ జనరేషన్‌ క్‌ప ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తెలుగు గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి జోరు కొనసాగిస్తున్నాడు. 12రౌండ్లు ముగిసే సరికి అర్జున్‌ 24 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ప్రజ్ఞానంద 19 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నాడు. 9, 12 రౌండ్లలో నెగ్గిన అర్జున్‌.. 11వ రౌండ్‌ను డ్రాగా ముగించాడు. 10వ రౌండ్‌లో డుడా (పోలెండ్‌) చేతిలో ఇరిగేసి ఓటమి పాలయ్యాడు. కాగా, ప్రజ్ఞానంద ఆడిన నాలుగు రౌండ్లను డ్రా చేసుకున్నాడు. వరల్డ్‌ చాంపియన్‌ కార్ల్‌సన్‌ 25 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. 

Updated Date - 2022-09-22T06:50:53+05:30 IST