అర్జున్‌ ఐదో గెలుపు

ABN , First Publish Date - 2022-01-22T09:20:16+05:30 IST

టాటా స్టీల్‌ చెస్‌ చాలెంజర్‌ టోర్నీలో ఇరిగేసి అర్జున్‌ వరుస విజయాలతో అదరగొడుతున్నాడు.

అర్జున్‌ ఐదో గెలుపు

విజ్క్‌ ఆన్‌ జీ (నెదర్లాండ్స్‌): టాటా స్టీల్‌ చెస్‌ చాలెంజర్‌ టోర్నీలో ఇరిగేసి అర్జున్‌ వరుస విజయాలతో అదరగొడుతున్నాడు. శుక్రవారం ముగిసిన ఆరో రౌండ్లో సూర్య శేఖర గంగూలీని అర్జున్‌ 42 ఎత్తుల్లో చిత్తు చేశాడు. ఇప్పటివరకు జరిగిన ఆరు రౌండ్లలో తొలి గేమ్‌ను డ్రాగా ముగించిన అర్జున్‌ మిగిలిన ఐదు రౌండ్లలోనూ విజయాలు సాధించాడు. ప్రస్తుతం అర్జున్‌ 5.5 స్కోరుతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాడు. ఇక, ఇదే ఈవెంట్‌లోని మాస్టర్స్‌ పోటీల్లో ఆరు రౌండ్లు ముగిసేసరికి అర్జున్‌ నాలుగు పాయింట్లతో టాప్‌లో ఉన్నాడు.

Updated Date - 2022-01-22T09:20:16+05:30 IST