టాప్‌లో అర్జున్‌

ABN , First Publish Date - 2022-09-21T09:34:27+05:30 IST

జూలియర్‌ బేర్‌ కప్‌లో ఇరిగేసి అర్జున్‌ ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి 17 పాయింట్లతో అగ్రస్థానం లో కొనసాగుతున్నాడు.

టాప్‌లో అర్జున్‌

న్యూయార్క్‌: జూలియర్‌ బేర్‌ కప్‌లో ఇరిగేసి అర్జున్‌ ఎనిమిది రౌండ్లు ముగిసేసరికి 17 పాయింట్లతో అగ్రస్థానం లో కొనసాగుతున్నాడు. 8వ రౌండ్‌లో క్రొయేషియా జీఎం సరిక్‌ ఇవాన్‌తో తలపడిన అర్జున్‌ 38 ఎత్తులు తర్వాత డ్రా చేసుకున్నాడు. ఇదే రౌండ్‌లో నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో ఆడిన తమిళనాడు జీఎం ప్రజ్ఞానంద 67 ఎత్తుల అనంతరం డ్రాగా ముగిం చాడు. మొత్తానికి 8 రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రజ్ఞానం ద మెరుగైన టేబుల్‌ రేటింగ్‌తో 15 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, కార్ల్‌సన్‌ 15 పాయింట్లతో తృతీయ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈనెల 25న టోర్నీ ఫైనల్‌ జరగనుంది.

Updated Date - 2022-09-21T09:34:27+05:30 IST