Abn logo
Mar 1 2021 @ 13:52PM

మలైకా కోసం ఫొటోగ్రాఫర్ అత్యుత్సాహం.. అర్జున్ ఆగ్రహం!

తన కంటే వయసులో 12 ఏళ్లు పెద్దదైన, ఓ బిడ్డకు తల్లి కూడా అయిన హీరోయిన్ మలైకా అరోరాతో సహజీవనం చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్. భర్త నుంచి విడాకులు తీసుకున్న అనంతరం 2018 నుంచి అర్జున్‌తో మలైకా డేటింగ్ చేస్తోంది. వీరిద్దరూ బహిరంగంగానే కలిసి తిరుగుతుంటారు. తాజాగా వీరిద్దరూ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఇంటికి విచ్చేశారు. 

కరీనా ఇటీవల ఓ పండంటి మగబిడ్డకు జన్మినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ చిన్నారిని చూసేందుకు అర్జున్, మలైక ముంబైలోని సైఫ్ ఇంటికి వెళ్లారు. ఒకే కారు నుంచి దిగిన వీరిద్దరినీ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడ్డారు. ఓ ఫొటోగ్రాఫర్ అయితే ఏకంగా సైఫ్ ఇంటి గోడ కూడా ఎక్కేశాడు. అతనిని చూసిన అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. `ఇది చాలా పెద్ద తప్పు. ముందు గోడ దిగండి. ఇంటి గోడలు ఇలా ఎక్కకూడద`ని పేర్కొన్నాడు. 

Advertisement
Advertisement
Advertisement