అర్జున్‌, ప్రజ్ఞానంద దూకుడు

ABN , First Publish Date - 2022-08-08T10:18:50+05:30 IST

చెస్‌ ఒలింపియాడ్‌ 9వ రోజు పోటీల్లో యువ గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ (తెలంగాణ), ప్రజ్ఞానంద (తమిళనాడు) అద్భుత విజయాలు సాధించారు.

అర్జున్‌, ప్రజ్ఞానంద దూకుడు

చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్‌ ఒలింపియాడ్‌ 9వ రోజు పోటీల్లో యువ గ్రాండ్‌మాస్టర్లు అర్జున్‌ (తెలంగాణ), ప్రజ్ఞానంద (తమిళనాడు) అద్భుత విజయాలు సాధించారు. దీంతో ఆదివారం జరిగిన 9వ రౌండ్‌లో పురుషుల కేటగిరీలో హరికృష్ణ సారథ్యంలోని భారత జట్టు 3-1తో బ్రెజిల్‌పై నెగ్గింది. ఈ జట్టులో క్రీకార్‌ సివాగ్‌ను అర్జున్‌ ఓడించాడు. భారత్‌-2 టీమ్‌ 2-2తో అజర్‌బైజాన్‌తో డ్రా చేసుకుంది. ఈ జట్టులో డురార్‌ బైలీపై ప్రజ్ఞానంద గెలిచాడు. భారత్‌-3 జట్టు 3-1తో పరాగ్వేపై గెలుపొందింది. మహిళల కేటగిరీలో హంపి సారథ్యంలోని భారత్‌ జట్టు 1.5-2.5తో పోలెండ్‌ చేతిలో ఓటమి పాలైంది. ఇక, భారత్‌-2 టీమ్‌ 4-0తో స్విట్జర్లాండ్‌పై క్లీన్‌స్వీప్‌ చేయగా.. భారత్‌-3 జట్టు 3-1తో ఎస్తోనియాపై నెగ్గింది.

Updated Date - 2022-08-08T10:18:50+05:30 IST