తెలంగాణలో దొరల పాలన

ABN , First Publish Date - 2022-07-04T05:14:46+05:30 IST

తెలంగాణలో దొరల పాల న నడుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీ ణ్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణలో దొరల పాలన
సుల్తానాబాద్‌లో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

సుల్తానాబాద్‌, జూలై 3: తెలంగాణలో దొరల పాల న నడుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీ ణ్‌కుమార్‌ అన్నారు. సుల్తానాబాద్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం విశ్వకర్మల ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీ ణ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో తండ్రీకొడుకు లు అహంకారంతో బీసీలపై నోరుపారేసుకుంటున్నార న్నారు. రెండు రోజుల క్రితం కేటీఆర్‌ విశ్వకర్మ కుటుం బానికి చెందిన వ్యక్తిని అవమానకరంగా మాట్లాడార న్నారు. ఇది వారి ఆహంకారానికి పరాకాష్ట అని అన్నా రు. ఇదే భాషను కేసీఆర్‌, కేటీఆర్‌లు అగ్ర కులస్తుల విషయంలో ఉపయోగిస్తారా అన్ని ప్రశ్నించారు. పైగా కేటీఆర్‌ వివరణ మరీ ఘోరంగా ఉందన్నారు. కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆయన నాంపల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద ముక్కు భూమికి రాయాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.200 కోట్ల టెండర్లను ఆంధ్రా కాంట్రాక్టర్‌ల తో ఓ స్టార్‌ హోటల్‌లో సమావేశమై రూ.1538 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, ఇది కేవలం కమీషన్ల కోసమేనన్న సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో, మిషన్‌ భగీరథ లో కమీషన్లు తీసుకున్న కేసీఆర్‌, కేటీఆర్‌ల ఇంటికి వెళ్లకుండా పోలీ సులు సామాన్యుల ఇళ్లకు వచ్చి పేదలను అక్రమ అరెస్టులు చేయ డం తగదన్నారు. రాబోయే ఎన్నికల్లోనైనా మాయమాటలకు మోస పోకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కులాలవారు బీఎస్పీని ఆదరిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘాల నేతలు ఆకా రపు శ్రీనివాస్‌, లక్ష్మణాచారి, కట్ట రమేష్‌, కృష్ణమాచారి, సదానంద చారి, భాస్కరాచారి, బీఎస్పీ రాష్ట్ర కమిటీ మెంబర్‌ ఉరుమల్ల విశ్వం, ప్రధాన కార్యదర్శులు మహతి రమేష్‌, ఎనగందుల వెంకన్న, కోఆర్డి నేటర్‌ దేవోల గంగాధర్‌, పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి ఉష, హనమయ్య, వరికిల్ల మల్లేశ్‌, గొట్టె బాబు, సంకెనపల్లి లక్ష్మణ్‌, ఉరముల్ల విజయ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-04T05:14:46+05:30 IST