కారులో గగనవిహారం!

ABN , First Publish Date - 2022-06-25T04:42:56+05:30 IST

ప్రస్తుతం పట్టణాలు, మహానగరాల్లో ట్రాఫిక్‌ సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నపుడు మన వాహనమే గాల్లో ఎగిరితే ఎంత బావుంటుందో అనే ఊహ ఎంతో ఆనందాన్నిస్తుంది. అదే నిజమైతే ఎలా ఉంటుంది? ఆ నిజాన్నే మన ముందుంచేందుకు ఐఐటీహెచ్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌ పర్సనల్‌ ఏరియల్‌ వెహికిల్‌ నమూనాలను రూపొందించారు.

కారులో గగనవిహారం!
పీఏవీ నమూనాను పరిశీలిస్తున్న బీఎస్‌మూర్తి

గాల్లో సురక్షిత ప్రయాణానికి ఐఐటీహెచ్‌లో పరిశోధనలు

డ్రైవర్‌ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనం  నమూనాను ఆవిష్కరించిన పీహెచ్‌డీ స్కాలర్‌

45 పర్సనల్‌ ఏరియల్‌ వెహికిల్‌ నమూనాల ప్రదర్శన

తొలిసారిగా ప్యాసింజర్‌ బేస్డ్‌ డ్రోన్ల ప్రదర్శన

జూలై 4న ఐఐటీహెచ్‌లో లైవ్‌ డెమో


కంది, జూన్‌ 24: ప్రస్తుతం పట్టణాలు, మహానగరాల్లో ట్రాఫిక్‌ సమస్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ట్రాఫిక్‌లో చిక్కుకున్నపుడు మన వాహనమే గాల్లో ఎగిరితే ఎంత బావుంటుందో అనే ఊహ ఎంతో  ఆనందాన్నిస్తుంది. అదే నిజమైతే ఎలా ఉంటుంది? ఆ నిజాన్నే మన ముందుంచేందుకు ఐఐటీహెచ్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌ పర్సనల్‌ ఏరియల్‌ వెహికిల్‌ నమూనాలను రూపొందించారు. ప్రాక్టీస్‌ బేస్డ్‌ పీహెచ్‌డీ చేస్తున్న స్కాలర్‌ ప్రియబ్రత రౌత్రే.. డిజైన్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌వోడీ ప్రొఫెసర్‌ దీపక్‌ జాన్‌మాఽథ్యూ సహకారంతో, ఆస్ట్రేలియాలోని స్పిన్‌బన్‌ యూనివర్సిటీ పరిశోధకులతో కలిసి వీటికి రూపకల్పన చేశారు. ఐదేళ్ల నుంచి పరిశోధనలు జరిపి స్వయంప్రతిపత్తితో నడిచే పర్సనల్‌ ఏరియల్‌ వెహికిల్‌ 45 నమూనాలను రూపొందించారు. ఈ పీఏవీలలో ఒకరు లేదా ఇద్దరు సులభంగా ప్రయాణించేలా డిజెన్లను తయారు చేశారు. శుక్రవారం ఐఐటీహెచ్‌లో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పీఏవీల నమూనాల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా  డ్రైవర్‌ లేకుండా గాల్లో ప్రయాణించే వాహనాన్ని అభివృద్ధి చేయడం హర్షణీయమన్నారు. ఐఐటీహెచ్‌ అంటేనే నూతన ఆవిష్కరణలకు కేంద్రమని కొనియాడారు. ఐఐటీహెచ్‌ ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందుకోసం రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నామని బీఎస్‌ మూర్తి వెల్లడించారు. ఐఐటీహెచ్‌లోని అటానమస్‌ నావిగేషన్‌ ఆధ్వర్యంలో జూలై 4న ఐఐటీహెచ్‌ ప్రాంగణంలో తొలిసారిగా డ్రైవర్‌ లేకుండా సెన్సార్‌లు, జీపీఎస్‌ ఉపయోగించి ప్యాసింజర్‌ బేస్డ్‌ డ్రోన్ల ప్రదర్శన లైవ్‌ డెమోకు ఏర్పాట్లు చేస్తున్నామని మూర్తి వివరించారు. అలాగే, రక్త ప్రసరణ మెరుగుపర్చే కుర్చీలను ఐఐటీహెచ్‌ డిజైన్‌ విభాగం పరిశోధకులు రూపొందించారు. ఈ అటూఇటూ కదిలితే రక్త ప్రసరణ మెరుగుపడేలా చిన్న చక్రాలను పూసల్లాగా కుర్చి అంతటా అమర్చారు. అతి త్వరలోనే దీనిని మార్కెట్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు ఐఐటీహెచ్‌ అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2022-06-25T04:42:56+05:30 IST