జరిమానా కట్టిన అర్జెంటీనా ప్రెసిడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-05-24T20:40:11+05:30 IST

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి బర్త్ డే పార్టీ చేసుకున్నందుకు అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్ జరిమానా కట్టారు.

జరిమానా కట్టిన అర్జెంటీనా ప్రెసిడెంట్.. ఎందుకో తెలిస్తే షాక్!

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి బర్త్ డే పార్టీ చేసుకున్నందుకు అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండేజ్, అతని భార్య ఫాబియోలా యేనెజ్ జరిమానా కట్టారు. ఇద్దరూ కలిసి 24 వేల డాలర్ల (దాదాపు 18.63 లక్షలు)ను వ్యాక్సిన్ రీసెర్చ్ సెంటర్‌కు అందించారు. కోవిడ్ లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో 2020 జులైలో అర్జెంటీనా ఫస్ట్ లేడీ ఫాబియోలా యేనెజ్ బర్త్ డే పార్టీ గ్రాండ్‌గా జరిగింది. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


ఆ పార్టీపై అర్జెంటీనా ఫెడరల్ కోర్టులో విచారణ జరిగింది. ఆ పార్టీ వెనుక ఎలాంటి హానికర ఉద్దేశాలు లేవని, అది కేవలం నిర్లక్ష్యం వల్లే జరిగిందని అధ్యక్షుడు క్షమాపణలు చెప్పారు. దీంతో కోర్టు అధ్యక్షుడికి, మొదటి మహిళకు జరిమానా విధించింది. అధ్యక్షుడికి 1.6 మిలియన్ పోసెస్‌లు, మొదటి మహిళకు 1.4 మిలియన్ పోసెస్‌లు జరిమానా విధించింది. ఆ డబ్బులను ఇద్దరూ మాల్‌బ్రాన్ వ్యాక్సిన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు విరాళంగా అందించాలని ఆదేశించింది. కాగా, ఆ జరిమానాను ఇద్దరూ తాజాగా కట్టేశారు. కాగా, ఆ జరిమానా కట్టేందుకు అధ్యక్షుడు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. 


Updated Date - 2022-05-24T20:40:11+05:30 IST