అర్జెంటీనాకు డ్రా

ABN , First Publish Date - 2021-06-16T06:43:53+05:30 IST

కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని అర్జెంటీనా డ్రాతో ప్రారంభించింది. గ్రూప్‌-బిలో భాగంగా మంగళవారం చిలీతో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది...

అర్జెంటీనాకు  డ్రా

  • కోపా కప్‌

రియో (బ్రెజిల్‌): కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీని అర్జెంటీనా డ్రాతో ప్రారంభించింది. గ్రూప్‌-బిలో భాగంగా మంగళవారం చిలీతో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 1-1తో డ్రా చేసుకుంది. 33వ నిమిషంలో లియోనెల్‌ మెస్సీ ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచడంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.  ఎడ్వర్డో వర్గాస్‌ (57వ నిమిషం) గోల్‌తో చిలీ 1-1తో స్కోరు సమం చేసింది. మరో గ్రూప్‌-బి మ్యాచ్‌లో పరాగ్వే 3-1తో బొలీవియాపై గెలిచింది. 

పోర్చుగల్‌ బోణీ: ‘యూరో 2020’ చాంపియన్‌షిప్‌లో పోర్చుగల్‌ బోణీ చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎఫ్‌ మ్యాచ్‌లో పోర్చుగల్‌ 3-0తో హంగేరిపై గెలుపొందింది.

Updated Date - 2021-06-16T06:43:53+05:30 IST